వీరీవీరీ గుమ్మడి.. పోషకం పేరేమిటి?
ఆహార పదార్థాలను ఎంచుకోవడంలోనే సగం ఆరోగ్యం ఇమిడి ఉంటుంది. ఎందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుని తినడం మంచిది. అయితే కొన్నిటిని తినొచ్చని తెలిసినా కూడా, వండుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. వాటిలో ఒకటి బూడిద గుమ్మడికాయ
ఆహార పదార్థాలను ఎంచుకోవడంలోనే సగం ఆరోగ్యం ఇమిడి ఉంటుంది. ఎందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుని తినడం మంచిది. అయితే కొన్నిటిని తినొచ్చని తెలిసినా కూడా, వండుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. వాటిలో ఒకటి బూడిద గుమ్మడికాయ. దిష్టి కోసం ఇంటి ముందు కట్టడానికే పరిమితమైన బూడిద గుమ్మడిలో పోషకాలు అనేకం. పైగా ఇందులో క్యాలరీలు తక్కువ. విటమిన్ ఎ, బి6, సి, ఇ పుష్కలం. మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫొలేట్, నియాసిన్, థయామిన్, కెరోటిన్, ల్యుటెయిన్, జియాక్సాంథిన్ వంటి ఖనిజ లవణాలూ ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.
- బూడిద గుమ్మడిలో ఫైటోస్టెరోల్స్ అధికం. ఇవి శరీరంలోని కొవ్వులను సాధారణ స్థాయికి తీసుకొస్తాయి. తద్వారా గుండె సమస్యలను, కొన్నిరకాల క్యాన్సర్లను నివారిస్తాయి.
- సాధారణంగా ట్రిప్టోఫాన్ లోపం వల్ల కుంగుబాటు వస్తుంది. బూడిద గుమ్మడిలో ఉండే ఎల్-ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లాన్ని శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు. బూడిద గుమ్మడిని ఆహారంలో చేర్చుకుంటే కుంగుబాటునూ అధిగమించొచ్చు.
- ల్యుటెయిన్, జియాక్సాంథిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. శుక్లాలు, కండరాల క్షీణత, చత్వారం లాంటి సమస్యలు రాకుండా చేస్తాయి. గుమ్మడిలో విటమిన్-ఎ అధికం. కంటిచూపు మెరుగ్గా ఉంటుంది.
- గుమ్మడి గింజల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి. వీటి కషాయంతో కడుపులో మంట మాయం అవుతుంది.
- తరచూ బూడిద గుమ్మడి రసం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్తకణాలు అధికంగా ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడుతుంది.
- గుమ్మడికాయతో పాటు గింజల్లోని కెరోటినాయిడ్స్, జింక్.. ప్రొస్టేట్ క్యాన్సర్ నివారణకు సాయపడతాయి. మూత్రాశయ సమస్యలను దూరం చేస్తాయి. బినైన్ ప్రోస్టేటిక్ హైపరేసియా చికిత్సలో గుమ్మడి గింజలు వాడతారు.
- యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. బూడిద గుమ్మడి గుజ్జుతో చర్మానికి ప్యాక్ వేసుకోవచ్చు. దీనితో తయారుచేసిన మాయిశ్చరైజర్, ఫేస్ మాస్క్, పీల్స్ మంచి ఫలితాలను ఇస్తాయి. ముఖంపై ముడతలు,
- మచ్చలు రాకుండానూ గుమ్మడి నివారిస్తుంది. కాబట్టి, ఇక నుంచి అయినా బూడిద గుమ్మడి వంటలను వద్దనకుండా తినండి.
- – మయూరి ఆవుల, న్యూట్రిషనిస్ట్
Mayuri@trudiet.in
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

