అపవిత్రః పవిత్రోవా
నిత్యవిధుల్లో పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోక పఠనంతోనే ప్రారంభమవుతాయి. ఈ మంత్రం చదువుతూ శరీరంపై, పూజ ద్రవ్యాలపై నీళ్లు చల్లుతారు.
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపి వా
యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శ్శుచిః
నిత్యవిధుల్లో పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోక పఠనంతోనే ప్రారంభమవుతాయి. ఈ మంత్రం చదువుతూ శరీరంపై, పూజ ద్రవ్యాలపై నీళ్లు చల్లుతారు. భగవంతుడి అనుగ్రహం పొందాలంటే బాహ్య, అంతరంగ శౌచం (శుభ్రత) తప్పనిసరి. దైవనామాన్ని చదువుతూ అంతరంగాన్ని శుభ్రం చేసుకొని పూజ మొదలుపెట్టాలని చెబుతారు పెద్దలు. మనసు పవిత్రంగా ఉండాలంటే ముందుగా శరీరం శుభ్రంగా ఉండాలి. తర్వాత అంతరంగం పరిశుభ్రంగా ఉండాలి.
ఈ విషయాన్ని గుర్తించే సనాతన ధర్మం శుభ్రతకు చాలా ప్రాధాన్యాన్నిచ్చింది. స్నానాది విధులు బాహ్య శౌచాన్ని కలిగిస్తాయి. భౌతికంగా శుభ్రంగా ఉన్నప్పుడే మానసిక ఉన్నతి సాధ్యమవుతుంది. పైకి చూడటానికి శుభ్రంగా కనిపించినా అంతరంగంలో మాత్రం ఎన్నో వాసనలు పేరుకుపోయి ఉంటాయి. అసూయ, ఆందోళన, ఈర్ష్య, ద్వేషం, కోపం ఇలా ఎన్నో అవగుణాలు మనసును ఆవహించి ఉంటాయి. వాటన్నిటినీ తొలగించుకోవడమే అంతర్ శుచి. మనసును స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంచటమే మానసిక శౌచం. చిత్తం శుద్ధిగా ఉన్నప్పుడే మలినాలేవీ శరీరానికి అంటకుండా ఉంటాయి.
నలుగురిలో అందంగా కనిపించడానికి శుభ్రత పాటించాలి అనుకుంటాం. లౌకికంగా అది ఆచరించాల్సిన నియమం. అందంగా కనిపించడం కోసమే కాదు ఆత్మశుద్ధికీ శుచి అవసరం. శుభ్రత వల్ల బలం, ఆయుష్షు, ఆరోగ్యం లభిస్తాయని చెబుతున్నది శాస్త్రం. శుభ్రత లేని చోట పరమాత్మ ఉండడు. స్నానం చేసి, పరిశుభ్రమైన వస్ర్తాలు ధరించి ధ్యానం ప్రారంభించాలి. ఇది ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టు. శాస్త్ర గ్రంథాలు కూడా ‘శుచిత్వం మాతృరూపేణ’ అంటాయి. వేదమంత్రాలు, ఉపనిషత్తులు సైతం శుచికి తగు ప్రాధాన్యం ఇచ్చాయి. ‘శుచిత్వమే జ్ఞానం’ అని ప్రకటించాడు కృష్ణ పరమాత్మ. శారీరక సౌఖ్యానికి, మానసిక ఉన్నతికి శుచిత్వాన్ని జీవన విధానంగా మార్చుకోవాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

