Ramanna Youth | పట్టవలయున్ పట్టు గట్టిగా.. పట్టినచో సాధించవలెన్
అందరికీ అతనో నటుడు. టైమింగ్ అతని బలం. హీరో పాత్రలకు పర్ఫెక్ట్ దోస్తు. కానీ, ఆ యువకుడు మాత్రం కెమెరా ముందు నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం.. తన జీవితం అవుతుందని అస్సలు ఊహించలేదు. కానీ ‘పట్టవలయున్ పట్టు గట్టిగా.. పట్టినచో సాధించవలెన్' అన్నట్టు నటుడిగా అలరించిన అతగాడు దర్శకుడిగా ప్రయత్నించి తొలి సినిమాతోనే వారెవ్వా అనిపించుకున్నాడు.
Ramanna Youth | అందరికీ అతనో నటుడు. టైమింగ్ అతని బలం. హీరో పాత్రలకు పర్ఫెక్ట్ దోస్తు. కానీ, ఆ యువకుడు మాత్రం కెమెరా ముందు నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం.. తన జీవితం అవుతుందని అస్సలు ఊహించలేదు. కానీ ‘పట్టవలయున్ పట్టు గట్టిగా.. పట్టినచో సాధించవలెన్’ అన్నట్టు నటుడిగా అలరించిన అతగాడు దర్శకుడిగా ప్రయత్నించి తొలి సినిమాతోనే వారెవ్వా అనిపించుకున్నాడు. ‘రామన్న యూత్’ సినిమాతో హిట్టు కొట్టిన దర్శకుడు, హీరో అభయ్ నవీన్ పరిచయం ఇది.
అభయ్ ఇంజినీరింగ్ చదివాడు. కాలేజ్ నుంచి బయటికి రాగానే బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. తండ్రి టీచర్. ఆర్థికంగా ఓ మోస్తరు కుటుంబం. అభయ్ మాటలు ఎదుటి వారిని బాగా ఆకట్టుకుంటాయి. అందులో సెటైరికల్ ఫన్ ఉంటుంది. అదే బ్యాంకు కొలీగ్స్‌ను అతనికి ఫ్యాన్స్ చేసింది. దీంతో ఒకరోజు ‘నువ్వు సినిమాల్లో ట్రై చెయ్’ అని ఓ సహోద్యోగి సలహా ఇచ్చాడు. అప్పటివరకు అతనికి సినిమాల ఆలోచనే లేదు. ఏదో కాలేజ్ రోజుల్లో ఫన్నీ స్కిట్స్ చేశాడంతే! సీనియర్ సలహా గురించి ఆలోచిస్తుండగానే ఆఫీస్‌లో అందర్నీ పదోన్నతులు పలకరించాయి. అనుభవం లేదని అభయ్‌కి ఇంక్రిమెంట్‌తో సరిపెట్టారు. అంతే మనోడు హర్ట్ అయ్యాడు. రాత్రికి రాత్రే ఉద్యోగం మానేయాలని ఫిక్సయ్యాడు. మర్నాడే రాజీనామా చేశాడు.
వాట్ నెక్ట్స్ ..
తర్వాత ఏంటి? తన సహోద్యోగి మాటలు గుర్తొచ్చాయి. రామానాయుడు స్టూడియోలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఎక్కడో.. ఏదో సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయని వెళ్లాడు. సెలెక్ట్ అయ్యాడు. ‘బొమ్మల రామారం’ సినిమాలో అవకాశం వచ్చింది. అది పెద్దగా విజయం సాధించలేదు. నిరాశలో ఉండగానే తరుణ్ భాస్కర్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లాడు. హీరో ఫ్రెండ్ పాత్రకు సెలెక్ట్ అయ్యాడు. ‘పెళ్లిచూపులు’ సినిమా సూపర్ హిట్. అభయ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమా అవకాశాలు కూడా పెరిగాయి.
ఓ యువకుడి కథ
ఆ సమయంలోనే అభయ్ ఓ కథ రాసుకున్నాడు. గ్రామాల్లో బడా రాజకీయ నాయకుల వెంట తిరగాలని ఉవ్విళ్లూరే ఓ యువకుడి కథ అది. కొంతమంది నిర్మాతలను కలిసి కథ చెప్పాడు. అందరూ బాగుందన్నారు. కానీ, ప్రొడ్యూస్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. క్రౌడ్ ఫండింగ్ చేద్దాం అనుకున్నాడు. వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు నిర్మాత దొరికాడు. అభయ్ అమ్మమ్మ ఊరు సిద్దిపేట జిల్లాలోని అంకుశాపూర్‌లో షూటింగ్ మొదలైంది. ఊరంతా అతనికి సపోర్ట్ చేసింది. సినిమా పూర్తయింది. విడుదలే మిగిలింది. అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయని అనుకునేంతలో కష్టాలు మొదలయ్యాయి. అనుకోకుండా అభయ్ తండ్రి కన్నుమూశాడు. కొండంత బాధను గుండెల్లో దాచుకొని సినిమా విడుదల కోసం ప్రయత్నాలు చేశాడు. మూడేండ్ల నిరీక్షణ ఫలించి.. ‘రామన్న యూత్’ రిలీజైంది. తొలిరోజే పాజిటివ్ టాక్ వచ్చింది. ‘సినిమా విడుదల అయితే చాలు అనుకుంటున్న ఈ రోజుల్లో.. బాగుంది అనిపించుకున్నదంటే నా కష్టం వృథా కాలేదు. త్వరలోనే మరో యూత్ ఫుల్ తెలంగాణ సినిమాతో మీ ముందుకొస్తా’ అంటున్నాడు అభయ్.
-ప్రవీణ్ కుమార్ సుంకరి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Health tips | పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఎందుకో తెలుసా..?
MLC Dasoju Shravan Kumar | ప్రకాష్ గౌడ్‌కి రెడ్ కార్పెట్ వేసి.. మా సుధీర్ రెడ్డినేమో అడ్డుకున్నారు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్ బతుకమ్మ, దసరా ఆదాయం
అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

