10K Steps Challenge | జాగింగ్, రన్నింగ్ చాలామందికి ఇష్టం ఉండదు. కొందరికి అంత సత్తువ కూడా లేకపోవచ్చు. అలాంటివారు హాయిగా నడక సాగించవచ్చని సలహా ఇస్తున్నారు ఫిట్నెస్ నిపుణులు. అందుకే ‘10కే స్టెప్స్ చాలెంజ్’ అనేకాన్సెప్ట్ను తెరపైకి తెచ్చారు. రోజూ రెండు గంటలు నడక సాగిస్తే.. కనీసం పదివేల అడుగులు వేసినట్లే. క్యాలరీలను కరిగించడంలో ఆశ్రమ సాయపడుతుందని చెబుతున్నారు. నడక వల్ల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ‘స్మార్ట్ వర్కవుట్’ పుణ్యమా అని క్యాలరీలను భారీగానే కరిగించుకోవచ్చు. స్థూలకాయంతో బాధపడేవారికి ఇదొక చక్కని పరిష్కారం కూడా. కాబట్టే చాలామంది తమ స్నేహితులు, ఆత్మీయులకు ‘10కే స్టెప్స్ చాలెంజ్’ విసురుతున్నారు. ఆ సవాలును పూర్తిచేసినవారు సగర్వంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీరూ సిద్ధమేనా?