e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home జిందగీ పేపర్‌..సూపర్‌!

పేపర్‌..సూపర్‌!

పేపరు మీద రాసుకోవచ్చు. పేపరు చదువుకోవచ్చు. పేపరుతో పొట్లం కట్టుకోవచ్చు. అంతేనా, పేపరుతో నగలుకూడా తయారు చేసుకోవచ్చు. ధర చవక. మహా తేలిక. ధరిస్తే.. రంభా ఊర్వశులే అసూయ పడాలిక! కాగితపు ఆభరణాలు కాంతల మనసులను దోచేస్తున్నాయి.

ఆభరణాలంటే బంగారంతోనో, వెండితోనో చేసినవే కానక్కర్లేదు. కంటికి అందంగా, ఒంటికి సౌకర్యంగా ఉంటే చాలు. అందుకే, రకరకాల నగలు మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వింతవింత డిజైన్లతో వస్తున్న కాగితపు నగలు ఆభరణాల వరుసలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కాగితంతో చేసిన అలంకరణ వస్తువులు, బ్యాగులు చాలారోజుల నుంచీ ఉన్నాయి. కానీ ఇప్పుడు పాత పేపర్లు, రంగుల కాగితాలతో మిరుమిట్లుగొలిపే నగలను తయారుచేస్తున్నారు. హారాలు, గాజులు, కమ్మలు, ఉంగరాలు.. కోరుకున్న ఆభరణం కాగితంతో తయార్‌!

- Advertisement -

మరీ చవక.. మహా తేలిక!
బంగారం, వెండితోనే కాదు గిల్ట్‌ నగలతో పోల్చుకున్నా కాగితపు నగలు చాలా చవక. ధర తక్కువగా ఉండటంతో వైవిధ్యమైన డిజైన్లు ఎంచుకునే అవకాశం ఉంటుంది. పెద్దపెద్ద హ్యాంగింగ్స్‌ పెట్టుకున్నా, చెవులు పాడవుతాయనే భయం లేదు. ఎంత భారీ నగలైనా తేలికగా, సౌకర్యంగా ఉంటాయి. ఇదే అవకాశంగా భావిస్తూ దుస్తుల అమ్మకందారులు చేనేత, పట్టుచీరలతో కాగితపు నగల సెట్లను ఉచితంగా అందిస్తున్నారు. కాగితపు నగల తయారీకూడా సులభమే. ఇంట్లోనే చేసుకుని అలంకరించుకోవచ్చు. ఇదో ఉపాధి మార్గంగానూ మారింది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అమ్మకాలు జరుపుతున్నారు.

కాగితం ఉంటే చాలు..
ఈ నగల తయారీలో ముఖ్య ముడిపదార్థం కాగితమే. అందమైన పూలు, జంతువుల ఆకారాల్లోనూ తయారు చేసుకోవచ్చు. నెమలి పింఛం వంటి అందమైన ఆకృతులను మలుచుకో వచ్చు. వెస్ట్రన్‌ వేర్‌పైనా నప్పుతాయి. ఉద్యోగాలకు, కాలేజీలకు వెళ్ళేవారు రోజువారీ నగలకింద ధరించవచ్చు. వేడుక ఏదైనా నీళ్ళు తాకనంత వరకూ, ఎలాంటి నిర్వహణ ఖర్చులు లేకుండా నిరభ్యంతరంగా పేపర్‌ జువెలరీని అలంకరించుకోవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana