యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
స్వాతినక్షత్ర పూజలు | నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆలయ అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు.

యాదాద్రి భువనగిరి : నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఆలయ అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ఉదయం బాలాలయంలో సుప్రభాతం చేపట్టిన పూజారులు వైష్ణవ ఆచారంగా పంచ నారసింహలను మేల్కొల్పి హారతి నివేదన, తులసీ పత్రాలతో అర్చన జరిపారు. స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు.
నరసింహుని జన్మనక్షత్రం సందర్భంగా శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శత కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు,పెరుగుతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో ఆలయ, అధికారులు భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు.
సహస్రనామాలతో అష్టోత్తరం, భక్తులకు దర్శనమిచ్చే కవచ మూర్తులకు స్వర్ణపుష్పార్చన జరిపారు. కరోనా మహమ్మారి నుంచి సకల జనులకు విముక్తి కలిగించాలంటూ పూజలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

