Warangal : లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా పెంచుతాం.. డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవీ

వరంగల్ : లింగ నిర్ధారణ పరీక్షలపై ప్రత్యేక నిఘా పెడుతామని డీఎంహెచ్‌వో డాక్టర్ లలితాదేవి అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో అడ్వయిజరీ కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే సంబంధిత రెడియాలాజిస్ట్, గైనకాలాజిస్ట్ బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. కరోనా నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాపులు తక్కువగా నిర్వహించామని అన్నారు. రాబోయే రోజుల్లో ఆడపిల్లలు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించాలని సమావేశంలో పలువురికి సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ యాకూబ్‌పాషా, డాక్టర్ పద్మ, డాక్టర్ కళ్యాణి, లీగల్ అడ్వయిజర్ రేవతీ దేవి, జిల్లా మాస్ మీడియా అధికారి ఆశోక్‌రెడ్డి, సర్వోదయ సేవా సమితి ప్రతినిధి కవిరాజ్, సీహెచ్టీవో మాధవరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

