Warangal : వందశాతం వ్యాక్సిషన్ పూర్తి చేయాలి.. వరంగల్ కలెక్టర్ గోపీ

దుగ్గొండి : వందశాతం కరోనా వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసేలా చర్యలను ముమ్మరం చేయాలని వరంగల్ కలెక్టర్ గోపీ వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం దుగ్గొండి మండలంలోని తొగరాయి, వెంకటాపురం, దుగ్గొండి మండల కేంద్రంలో కలెక్టర్ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. తొగరాయి గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. గ్రామానికి తొలిసారి వచ్చిన కలెక్టర్ గోపీనీ ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, సర్పంచ్ ఓడేటి తిరుపతిరెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం వెంకటాపురంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను పరిశీలించి గ్రామంలో నిర్మించ తలపెట్టిన మిషన్‌భగీరథ వాటర్ ట్యాంక్‌ను కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
వాటర్ ట్యాంక్ నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా ఇచ్చిన స్థల దాత హింగే రామారావును కలెక్టర్ శాలువాతో సన్మానించారు. అక్కడి నుంచి దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఓపీ రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికలను తనిఖీ చేశారు. స్థానిక హోమియోపతి ఆసుపత్రి నిర్వహణపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హోమియోపతి వైద్యురాలు గైర్హజరు కావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి వసతులపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలనా పాటించి గ్రామాల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వో ప్రకాశ్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, సర్పంచ్‌లు ఓడేటి తిరుపతిరెడ్డి, హింగోళి రాజేశ్వర్‌రావు, వైద్యాదికారి రాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Kenya | స్వర్గం పేరుతో 190 మంది పిల్లలకు ఆకలి చావులు.. కెన్యాలో మత గురువు మూఢ బోధనలు
TGSRTC | తిరుగు ప్రయాణమూ భారమే..! ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో చార్జీల మోత
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

