సుబేదారి,(వరంగల్ ) సెప్టెంబర్ 13 : వరంగల్ పోలీసు కమిషనరేట్ క్యాంపు క్లర్క్ (సీసీ)వేణుగోపాల్ రావు, పౌర సంబంధాల అధికారి (పీఆర్వో) మోహన కృష్ణ పై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో పనిచేస్తున్న ఏవో ఇషాక్ ను కొత్త సీసీగా, పీర్వోగా సుబేదారి పీఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తిరుపతిని పోలీసు కమిషనర్ ఎన్ శ్వేత నియమించారు. ఈమేరకు శనివారం పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పాత సీసీ వేణుగోపాల్ రావు, పీఆర్వో మోహన కృష్ణ సుదీర్ఘ కాలంగా ఒకే పోస్టింగ్‌లో పనిచేస్తూ వీధుల దుర్వినియోగం పాల్పడినట్లు ఆరోపణల నేపథ్యం లో నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘కదలరు -వదలరు, వెలుగులోకి ఆ ఇద్దరు బాగోతాలు’ శీర్షకతో వరుస కథనాలు ప్రచురితం కావడంతో పోలీసు కమిషనర్ శ్వేత స్పందించారు. విచారణ జరిపించి బదిలీ వేటు వేశారు.
వేణుగోపాల్ ను వరంగల్ రేంజ్ డీఐజీ ఆఫీస్ బదిలీ చేయగా, పీర్వో మోహనకృష్ణను స్టేషన్ ఘనపూర్ పోలీసు స్టేషన్ కు బదిలీ చేయగా వారి స్థానంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఏవో గా పనిచేస్తున్న ఇషాక్ ను కొత్త సీసీగా, సుబేదారి పీఎస్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తిరుపతిని పీర్వో గా నియమిస్తూ పోలీసు కమిషనర్ శ్వేత శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.