Narsampeta : ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి.. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నర్సంపేట రూరల్ : ప్రతి ఒక్కరూ భగవంతుని సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాధన్నపేట చెరువుకట్టపై కాకతీయుల కాలంలో వెలిసిన అతి పురాతన రామలింగేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం జరిగిన లింగప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న దంపతులు హాజరయ్యారు. శివాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వేద పండితులు ఎమ్మెల్యే పెద్దికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సృష్టిలో దైవ మార్గాన్ని మించింది మరోకటి లేదని, ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. దైవ మార్గంతోనే అన్ని జయించవచ్చని, ఎంతటి వారైనా భగవంతుని సేవ చేయాల్సిందెనన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త దొడ్డ మోహన్‌రావు మాధన్నపేట చెరువు కట్టపై శివాలయాన్ని అత్యంత అద్బుతంగా నిర్మించడం హర్షించదగిన విషయమన్నారు. అనంతరం శివాలయ నిర్మాణ దాత దొడ్డ మోహన్‌రావును ఎమ్మెల్యే దంపతులు అభినందించారు. కార్యక్రమంలో శివాలయ నిర్మాణ దాత దొడ్డ మోహన్‌రావు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

