Bachhannapeta | రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం.. బచ్చన్నపేటలో భారీ ధర్నా
రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బచ్చన్నపేటలో ప్రజలు భారీ ధర్నా నిర్వహించారు.
బచ్చన్నపేట, ఫిబ్రవరి 23 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి కొడవటూరు కమాన్ వరకు అత్యంత ప్రమాదకరంగా మారిన రోడ్డును పునర్ నిర్మించాలని కోరుతూ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బచ్చన్నపేట ప్రజలు సోమవారం బందుకు పిలుపునిచ్చి పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు. దీంతో జనగామ, ఆలేరు, సిద్దిపేట వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఫైట్ ఫర్ బచ్చన్నపేట సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బందులో వ్యాపార వాణిజ్య సంస్థలో దుకాణాలు అన్ని మూసి ఉంచారు. అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు.
రోడ్డుపైన వంట వార్తకు సన్నాహాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అధ్వానంగా తయారైన రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే వారు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాలు ఈ రోడ్డు గుండా వెళ్తుంటాయని, దాంతో గుంతల మయమైన రోడ్లతో దుమ్ము లేచి రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న దుకాణదారులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. 20 రోజుల కింద బచ్చన్నపేటలో రోడ్డు నిర్మాణం కోసం రెండు గంటల పాటు భారీ ఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించామని, ఫలితంగా ఎస్ఐ హమీద్ ఆధ్వర్యంలో తహసిల్దార్ హుస్సేన్ సంఘటన స్థలానికి వచ్చి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రోడ్డు నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాను హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించామని వెల్లడించారు.
హామీ ఇచ్చి 20 రోజులు దాటినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంపై బందుకు పిలుపు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకునే వరకు రాస్తారోకో ధర్నా విరమించేది లేదని పట్టు పట్టుపట్టికూర్చున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోకపోతే ప్రభుత్వాలు అధికారులు ఉండి ఎందుకని వారు ప్రశ్నించారు. అవసరమైతే ఇక్కడనే వంటవార్పు చేసుకుని ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫైట్ ఫర్ బచ్చన్నపేట సంస్థ ప్రతినిధులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఎం పార్టీల నేతలతో పాటు పట్టణ ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు దుకాణదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

