KU | సొమ్మొకరిది, సోకు ఒకరిది..! కేయూ సొమ్ము ప్రైవేటుకు దారాదత్తం
సొమ్మొకరిది.. సోకు ఒకరిది అన్నట్లుగా ఉంది కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 8 : సొమ్మొకరిది.. సోకు ఒకరిది అన్నట్లుగా ఉంది కాకతీయ యూనివర్సిటీ పరిస్థితి. యూనివర్సిటీ సొమ్ము ప్రైవేట్‌కు ధారాదత్తం చేసుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కాకతీయ యూనివర్సిటీలో మొదటిసారిగా ఆన్లైన్ వాల్యుయేషన్ ప్రారంభించిన అధికారులు నిర్వాహణ కోసం ఓ ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పారు. కేయూ ఎగ్జామినేషన్ భవనంలో ఆన్లైన్ వాల్యుయేషన్‌కు ప్రైవేట్ సంస్థకు కేటాయించారు. ప్రైవేటు సంస్థ 40 కంప్యూటర్లు, 10 ఏసీలతో ఆన్లైన్ వాల్యుయేషన్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రారంభించి నాలుగు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు సంస్థకు ప్రత్యేకంగా కరెంటు మీటర్ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
కేయూ కరెంటునే వాడుతున్నారు
గతంలో జరిగిన తప్పిదాలు, అవకతవకలకు తావులేకుండా కాకతీయ యూనివర్సిటీ అధికారులు ఆన్లైన్ వాల్యూయేషన్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏప్రిల్ నుంచి ఓ ప్రైవేట్ సంస్థకు కేయూలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లోని మొదటి అంతస్థును అప్పగించింది. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ పరీక్షల జవాబుపత్రాలను ఈ సంవత్సరం నుంచి ఆన్లైన్లోనే వాల్యుయేషన్ ప్రారంభించారు. జవాబు పత్రాలను స్కానింగ్ చేసి ఆన్లైన్లో వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టే పనులను ఓ సంస్థకు అప్పగించారు. డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల జవాబుపత్రాల వాల్యుయేషన్ ఇప్పటికే ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు.
కేయూ పరిధిలోని అన్ని పరీక్షల జవాబుపత్రాలను ఆన్లైన్లో వాల్యుయేషన్ ప్రక్రియను పరీక్షల విభాగం అధికారులు ప్రారంభించారు. అందుకోసం ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లోని మొదటి అంతస్థు నుంచి పేపర్ల స్కానింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఆ ప్రైవేట్ సంస్థ బుక్లెట్ల స్కానింగ్ కోసం 20 కంప్యూటర్లు, ఏసీలు వినియోగిస్తోంది. వాటికి కావాల్సిన కరెంట్ మాత్రం కాకతీయ యూనివర్సిటీ అందిస్తోంది. ఏడు నెలలుగా యూనివర్సిటీనే కరెంట్ బిల్లు చెల్లిస్తుండటంతో అందరూ అవాక్కవుతున్నారు.
మూల్యాంకనంలో పాల్గొన్నవారికి ఒక బుక్‌లెట్‌కు కొంత రెమ్యూనరేషన్ చొప్పున చెల్లించడంతోపాటు టీఏ, డీఏ చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఏ జిల్లాకు చెందిన అధ్యాపకులైనా ఎక్కడ నుంచైనా కంప్యూటర్ ద్వారా వాల్యుయేషన్ చేయవచ్చు. పరీక్షల విభాగం నుంచి సబ్జెక్టుల వారీగా జవాబుపత్రాలను స్కాన్ చేసి సంబంధిత వెబ్సైట్లో పొందుపరుస్తారు.
ఆరు నెలలుగా విద్యుత్ మీటర్ ఊసేలేదు
ఎగ్జామినేషన్‌లో ఆరు నెలలుగా సెపరేట్ విద్యుత్ మీటర్ పెట్టకపోవడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు, కంట్రోలర్ ప్రైవేట్ సంస్థకు కొమ్ముకాస్తున్నారని వారి ఒప్పందంలో భాగంగానే చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపణలు లేకపోలేదు.
ఆరు నెలలుగా కరెంట్ మీటర్ ఊసేలేదని, యథేచ్ఛగా కేయూ కరెంట్‌నే వినియోగిస్తున్నా ప్రైవేట్ సంస్థకు సపరేట్ కరెంట్ మీటర్ పెట్టాలని సోయిలేదా అని ప్రశ్నిస్తున్నారు.. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇన్ని నెలలుగా కేయూ విద్యుత్ బిల్లు చెల్లిస్తూ వచ్చిందని, అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న కేయూ అధికారుల తీరుపై ప్రొఫెసర్లు, విద్యార్థిసంఘాల నాయకులు మండిపడుతున్నారు.
-సపరేట్ కరెంటు మీటర్ పెట్టిస్తాం
కాకతీయ యూనివర్సిటీలో మొదటిసారిగా ఆన్లైన్ వాల్యుయేషన్ ప్రారంభించాం. ఏప్రిల్ నుంచి మొదటి అంతస్థు ప్రైవేట్ సంస్థకు అప్పగించాం. ఒప్పందంలో భాగంగా మాకు కరెంట్ బిల్లు చెల్లిస్తుంది. సపరేట్ కరెంట్ మీటర్ పెట్టిస్తాం.
– కట్ల రాజేందర్, కాకతీయ యూనివర్సిటీ కంట్రోలర్
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

