పనుల్లో వేగం పెంచాలి
వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులు వచ్చే మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భా సర్ అధికారులను ఆదేశించారు.
- మార్చి 31 లోగా వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణం పూర్తి చేయాలి
- నాణ్యత విషయంలో రాజీ పడొద్దు
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్
- థౌజండ్ పిల్లర్స్, వరంగల్ కోట, జైనమందిరంపై అధికారులతో సమీక్ష
హనుమకొండ, అక్టోబర్ 19: వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణ పనులు వచ్చే మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భా సర్ అధికారులను ఆదేశించారు. బుధవారం హ నుమకొండ జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికా రులతో వేయిస్తంబాల దేవాలయ పునర్నిర్మాణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి, చీఫ్ విప్ మాట్లాడుతూ ఆయా పనులు పకడ్బందీ గా నాణ్యతతో చేపట్టాలన్నారు. చారిత్రక వరంగ ల్కు అత్యంత పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన వేయి స్తంభాల గుడిని తిరిగి అదే స్థాయిలో పునర్ ని ర్మాణం చేయాలన్నారు. ఇప్పటికే వివిధ సాంకే తిక కారణాలతో జరిగిన ఆలస్యాన్ని మరిపించే లా వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించా రు.
ఆరియాలజీ విభాగం కింద ఉండడం, అప్ప టి నిర్మాణ కౌశలం సాండ్ టెక్నాలజీ కావడం వల్లనే గాక, ఆయా బరువైన రాళ్లను కూర్చడం కూడా కొంత ఆలస్యానికి కారణమని అధికారు లు మంత్రికి, చీఫ్ విప్‌కు వివరించారు. అయితే సమస్యలు ఏవైనప్పటికీ అధిగమించాలని వేయి స్తంభాల దేవాలయంతో పాటు వరంగల్ కోట, జైన మందిరంపై కూడా సమీక్షించారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ఇచ్చిన రూ. కోటే కాక, ఇంకా నిధులు అవసరమైతే సమకూర్చాలని వారు అధికారులను అదేశించారు. వేయి స్తంభా ల దేవాలయం, కుడా లాండ్ పూలింగ్ వంటి అం శాలపై కూడా వారు అధికారులకు తగు సూచన లు చేశారు. ఈ సమావేశంలో టూరిజం, సాంసృ తిక శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా, జనగామ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, కుడా అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, డీఆర్వోలు, పాండురంగారావు, వేయి స్తంభాల ఆలయ అర్చకుడు గంగు ఉపేద్రశర్మ, టూరిజం, దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

