పట్టుబట్టి .. నిలబెట్టి

- ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవ
- 6 నుంచి 10 తరగతి వరకు ఆంగ్లబోధన
- క్రమంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య
- వందశాతం ఉత్తీర్ణత సాధించిన పదో తరగతి బ్యాచ్
- ఉత్తమ పాఠశాలగా అవార్డు
- కళకళలాడుతున్న శాయంపేట బాలుర హైస్కూల్
ఒకప్పుడు తన ఒడిలో ఎందరికో పాఠాలు చెప్పి ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఆ సరస్వతీ నిలయం కార్పొరేట్ దెబ్బకు కళ తప్పింది. ఇంగ్లిష్‌పై ఆసక్తితో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుకు పంపడంతో ఆ స్కూల్ బోసిపోయింది. విద్యార్థుల సంఖ్య తగ్గి మూతబడే పరిస్థితికి వచ్చిన ఆ బడిని ఇంగ్లిషు మీడియం నిలబెట్టింది. ఆంగ్ల బోధనే అస్త్రంగా మార్చుకుని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పట్టుబట్టి అనుమతి సాధించి బడిని బతికించారు. ఇప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగి విజ్ఞాన నిలయంగా మారి అవార్డులు కూడా పొందింది. అదే హనుమకొండ జిల్లా శాయంపేట మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల.
- శాయంపేట, జనవరి 29: హనుమకొండ జిల్లా శాయంపేట మండలకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విజ్ఞాన నిలయంగా మారింది. ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ కళకళలాడుతున్నది. ఒకప్పుడు చాలామంది విద్యార్థులతో ఉన్నతంగా ఉన్న బడి ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ దెబ్బకు విలవిల్లాడింది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇంగ్లిష్ మీడియంపై ఆసక్తితో చాలామంది తల్లిదండ్రులు తమపిల్లలను ప్రైవేటుకు పంపించారు. ఇలాగే వదిలేస్తే బడి బతకదని భావించిన ప్రధానోపాధ్యాయుడు వనం వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇంగ్లిష్ మీడియంతోనే బడి మనుగడ సాధిస్తుందని నమ్మారు. ఆంగ్లబోధన కోసం దరఖాస్తు పెట్టారు. మొదట ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం అనుమతులు మంజూరు చేస్తుండడంతో అవైనా ఇవ్వాలని అధికారులను కలిసి విన్నవించారు.
- లేకపోతే బడి మూసివేయాల్సిన పరిస్థితి రావొచ్చని వారికి వివరించారు. 2015లో ఆరు నుంచి పది తరగతుల్లో కేవలం 22 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని తరగతుల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఇంగ్లిష్ మీడియం తామే బోధిస్తామని, ఇందుకు అదనంగా స్టాఫ్ అవసరం లేదని ఉపాధ్యాయులే విల్లింగ్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం 2016లో 6, 7, 8 తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధనకు అనుమతి ఇచ్చింది. ఉన్న ఉపాధ్యాయులే ఇంగ్లిష్‌మీడియంలో శిక్షణ పొంది బోధనను ప్రారంభించారు. విస్త్రతంగా ప్రచారం చేశారు. తల్లిదండ్రులను కలిసి పరిస్థితిని వివరించి, పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని విన్నించారు. దీంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2019 వరకు ఆరు నుంచి పది తరగతులకు ఇంగ్లిష్‌మీడియంలో బోధనకు అనుమతులు వచ్చాయి. తల్లిదండ్రుల్లోనూ నమ్మకం పెరిగి ఇప్పుడు 60కిపైగా విద్యార్థులు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.
- ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పేద, ధనిక అందరూ కూడా ఇంగ్లిష్ మీడియంలోనే చదవడం అలవాటు చేసుకున్న నేపథ్యంలో హెడ్మాస్టర్ ప్రత్యేక చొరవ బడిని బతికించింది. పిల్లలకు చదువే కాదు.. యోగా వంటి అంశాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. అనేక మంది దాతలు సహాయం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం పదో తరగతిలో ఇప్పటికే ఒక బ్యాచ్ వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు పాఠశాలలకు ప్రభుత్వం అవార్డులు ఇవ్వగా, అందులో శాయంపేట బాలుర పాఠశాలకు అవార్డు దక్కింది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ నుంచి హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు అవార్డు అందుకున్నారు. అయితే వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రారంభిస్తుండడంతో ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం వస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
ఇంగ్లిష్ మీడియంతోనే బడి నిలబడింది
ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించడం మంచి నిర్ణయం. శాయంపేట బాలుర హైస్కూల్లో 2015లో విద్యార్థులు తగ్గిపోయారు. ఇంగ్లిష్ మీడియంపై ఆసక్తితో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపారు. ఎలాగైనా బడిని బతికించాలని నిర్ణయించి, ఉన్న వనరులను ఉపయోగించుకుని మేమే ఇంగ్లిష్‌మీడియంలో బోధిస్తామని విల్లింగ్ ఇచ్చి అనుమతులు సాధించినం. అప్పటి ఆర్జేడీ, ఇన్చార్జి డీఈవోగా ఉండడంతో సులువుగా అనుమతి వచ్చింది. పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో పుస్తకాలను అందించి బోధన ప్రారంభించాం. ప్రస్తుతం 60 మంది విద్యార్థులు ఉన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి పూర్వవైభవం వస్తుంది. మన ఊరు- మనబడి, ఆంగ్లమాధ్యమంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పడుతుంది. విద్యారంగంలో ఇది గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
- వనం వెంకటేశ్వర్లు, హెచ్ఎం, శాయంపేట బాలుర పాఠశాల
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

