Thousand-Pillar Temple | గాయత్రిదేవి అలంకరణలో వేయిస్తంభాల రుద్రేశ్వరదేవి
చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీదేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడోరోజు రుద్రేశ్వరీదేవిని గాయత్రీ దేవిగా అలంకరించారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 13 : చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీదేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడోరోజు రుద్రేశ్వరీదేవిని గాయత్రీ దేవిగా అలంకరించారు. అమ్మవారికి ఐదు రకాల పిండి వంటలు నివేదన సమర్పించి భక్తులంతా గాయత్రీ మంత్ర పారాయణం చేస్తుండగా రుదేశ్వరిదేవిని సింహ వాహనంపై మంగళ వాయిద్యాలు మంగళ హారతులతో రుద్రేశ్వరీదేవికి జై అంటూ వాహనసేవ నిర్వహించారు. లోకకళ్యానార్థం గ్రామ, జిల్లా, రాష్ర్టంలో ప్రజలను కరువు కాటకాల నుంచి కాపాడాలని గణపతి నవగ్రహ రుద్ర హోమాలు మూలమంత్రయుక్తంగా వైదికోక్తంగా 18 అధ్యాయాలతో దేవి ఉపాసకులు భరత్ శర్మ మహా చండీయాగం నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో వేలాది మంది భక్తులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దాతృత్వంలో నిత్యాన్నదానం చేశారు. సాయంకాలం తాడూరి రేణుక శిష్య బృందంచే కూచిపూడి నృత్యం నిర్వహించారు. పల్లకిసేవలో నీలం సుహాస్, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు పల్లం రమేష్, కోన శ్రీకర్, బండారి నరేష్, మాడిశెట్టి వరుణ్, సతీష్, నల్లెల లక్ష్మణ్, గుజ్జా సంపత్‌రావు సౌమ్య దంపతులు వాహన సేవలో పాల్గొని సేవలందించారు. ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, గంగు మణికంఠశర్మ వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
RS Praveenkumar | అసెంబ్లీలో జరిగిన చర్చ అంతా ఏక్షపక్షం.. జీవో నంబర్ 134 రాజ్యాంగ వ్యతిరేకం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Parnasala Movie | ‘పర్ణశాల’ సినిమా నుంచి వైరల్ ‘జిమ్ జిమ్ తార’ ఫుల్ సాంగ్ రిలీజ్!
Comrade Kalyan | బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ జోరు.. హిట్‌గా నిలిచిన కామెడీ డ్రామా!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

