హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 30 : తెలంగాణ రాష్ర్టంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు కనీస వేతనాలు 30 వేలు ఉండాలని తెలంగాణ రాష్ర్టంలో జనశక్తి లేబర్ సెల్ జనశక్తి మజ్దూర్ సభ అధ్యక్షుడు జి.సురేందర్ డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగులతో సమాన పనిగంటలు పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సురేందర్ ఆరోపించారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం 15 ఏళ్ల తర్వాత కాంట్రాక్టు కార్మికులకు చేసిన వేతన సవరణ చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 వేల నుంచి 16 వేలు అంటే 15 ఏళ్ల తర్వాత కేవలం 3 వేల నుంచి 4 వేల వరకు పెంచడం అనేది దురదృష్టకరమని, తక్షణమే కనీస వేతనంగా రూ.30 వేలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో వరంగల్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు పసునూరి రఘు, రాష్ర్ట కమిటీ సభ్యులు బాలశౌరి పాల్గొన్నారు.