ఊరు బడి సేవలో..

- రాజేందర్‌రెడ్డి, ఝాన్సీ దంపతుల ఔదార్యంతో పక్కా భవనాల నిర్మాణం
- పాఠశాల అభివృద్ధిలో బాసటగా విద్యావంతులు
- ఏటా స్కాలర్షిప్లు, ఫీజులు అందిస్తూ ప్రోత్సాహం
- 15 ఏళ్లుగా ఇంగ్లిష్ మీడియంలోనే విద్యాబోధనతో మెరుగైన ఫలితాలు
- అప్పటినుంచే ఆంగ్ల మాధ్యమ అడ్మిషన్లకు విద్యార్థుల ఆసక్తి
- ‘మన ఊరు-మన బడి’తో మరింత బలోపేతం
తొర్రూరు, జనవరి 30 : పూర్వ విద్యార్థుల సహకారంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలు నాణ్యమైన విద్యనందిస్తూ ఆదర్శంగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ ద్వారా అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి మౌలిక వసతుల కల్పనతో ముందడుగు వేయనున్న తరుణంలో చెర్లపాలెం పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థులకు గ్రామస్తులు అందించిన సహకారం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.
టీ‘చర్లపాలెం’గా గుర్తింపు
1964లో స్థాపించిన చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాల 2015లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. 58 ఏళ్ల క్రితం ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అందుబాటులోకి రావడంతో ఈ గ్రామంలో విద్యాధికుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఈ గ్రామం నుంచి ఇప్పటి వరకు 185 మంది వరకు ప్రభుత్వ టీచర్లు ఉండి అనేక ప్రాంతాల్లో సేవలందిస్తుండడం వల్ల టీ‘చర్లపాలెం’గా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం 90 మంది విశ్రాంత ఉపాధ్యాయులున్నారు. తొలి ఉపాధ్యాయుడు పరుపాటి ధర్మారెడ్డి కృషితో హెచ్.ప్రతాప్‌రెడ్డి మరిపెడ సమితి ఉపాధ్యక్షుడిగా పనిచేయగా హైస్కూల్ విద్య పూర్తి చేసిన ఎంతోమంది ప్రభుత్వ ఉపాధ్యాయులయ్యారు. ప్రస్తుతం గ్రామం నుంచి 25 మంది ప్రవాస భారతీయులు ఉండగా ఇద్దరు సైంటిస్టులు, 40 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఆరుగురు వైద్యులు, 25 మంది ఆర్టీసీ కండక్టర్లతో పాటు తొర్రూరు, వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తూ వ్యాపారాలు చేస్తున్న వారూ ఉన్నారు.
15 ఏళ్లుగా ఇంగ్లిష్ మీడియం..
చెర్లపాలెం జడ్పీ సెకండరీ పాఠశాలలో 2006-2007 విద్యాసంవత్సరంలోనే 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. 15ఏళ్లుగా ఇక్కడ తెలుగు, ఇంగ్లిష్ మీడియం కోర్సులున్నప్పటికీ విద్యార్థులు మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే అడ్మిషన్లు పొందుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 210 మంది ఈ స్కూల్లో ఉన్నారు. చెర్లపాలెం, చీకటాయపాలెం, గోపాలగిరితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు ఈ గ్రామంలో ఉన్న బీసీ హాస్టల్లో ప్రవేశం పొంది చదువుతుంటారు. ప్రాథమిక పాఠశాలలో కూడా సుమారు 150 మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ కూడా ఇంగ్లిష్ మీడియం ఆడ్మిషన్లు ఎక్కువగానే ఉన్నాయి. నాలుగేళ్లుగా పదో తరగతి విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధిస్తుండగా రెండేళ్లలో వార్షిక పరీక్షల్లో 11మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ సాధించారు. ఈ పాఠశాలలోనే 6 నుంచి పదో తరగతి వరకు చదివిన గ్రామానికి చెందిన ధర్మారపు నాగయ్య కూతురు స్పందన గతేడాది నీట్లో ఎస్సీ కేటగిరీలో 949వ ర్యాంక్‌తో మెడిసిన్ సీట్ సాధించింది. ఉపాధ్యాయుల నిబద్ధత, బోధన శైలి, పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల సహకారం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వరంగా మారింది.
రాజేందర్‌రెడ్డి-ఝాన్సీలక్ష్మీరెడ్డి దంపతుల ఔదార్యం
పాఠశాలలకు తన వంతు సహకారం అందిస్తూ హనుమాండ్ల రాజేందర్‌రెడ్డి, ఝాన్సీలక్ష్మీరెడ్డి దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులకు చెంది న గ్రామాల్లో వారి స్మారకార్థం పాఠశాల భవనాలు నిర్మించారు. ఎక్కడ చదువుకుంటే ఆ పాఠశాల అభివృద్ధికి చేయూతనందించారు. చెర్లపాలెంతో పాటు నెల్లికుదురు మండలం కాచికల్లు, నల్లగొండ జిల్లా సోలిపేట, సూ ర్యాపేట జిల్లా నకిరేకల్, ఖమ్మం జిల్లా బనిగిల్లపాడు, ములుగు జిల్లా పందికుంట, వరంగల్ జిల్లా నర్సంపేటలోని అశోక్‌నగర్ పాఠశాలల్లో సుమారు రూ.2కోట్ల విలువైన నిధులతో పక్కా భవనాలను నిర్మించి ఇచ్చారు. చెర్లపాలెం, బనిగిల్లపాడు పాఠశాలల్లో ఏటా రూ.2లక్షల మేర స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించే నిరుపేద విద్యార్థులకు రూ.10లక్షల మేర కళాశాల ఫీజులను నేరుగా చెల్లిస్తున్నారు.
ఊరుబడికి బాసటగా..
తమ ఉన్నతికి కారణమైన పాఠశాలకు చేతనైన సాయం చేస్తున్నారు. పాఠశాల స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్మించిన బ్లాక్‌లతో తరగతి గదుల కొరత కూడా తీరింది. అమెరికాలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్‌రెడ్డి, ఝాన్సీలక్ష్మీరెడ్డి దంపతులు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రాజేందర్‌రెడ్డి మాతృమూర్తి రాధమ్మ స్మారకార్థం ఐదు గదులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇచ్చా రు. ఉన్నత పాఠశాలలో రెండు తరగతి గదులు, డిజిటల్ విద్యాబోధనకు రెండు ప్రొజెక్టర్లను బహూకరించారు. ఎన్నో ఏళ్లుగా 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఏటా రూ.లక్ష మేర స్కాలర్షిప్లు, స్కూల్ బ్యాగులు అందిస్తూ పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.
- ప్రవాస భారతీయులుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఉ న్న గ్రామానికి చెందిన అనుమాండ్ల మహేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి సోదరులు రెండు డిజిటల్ ప్రొజెక్టర్లను అందజేశారు. మరో ఎన్నారై అనుమాండ్ల అశోక్‌రెడ్డి ఒక ప్రొజెక్టర్‌ను ఇవ్వడంతో పాటు మూడు సంవత్సరాల పాటు విద్యార్థులకు ఇంగ్లిష్ భాషలో మెళకువలను నేర్పేందుకు సొంత ఖర్చులతో ట్యూటర్‌ను ఏర్పాటు చేశారు.
- డీఆర్డీవోలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ జినుగ జగన్‌రెడ్డి ఏటా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల రూపేణా రూ.15వేల నగదు ప్రోత్సాహకాలను అందజేస్తున్నారు. విశ్రాంత ఎంఈవో అనుమాండ్ల కృష్ణారెడ్డి రూ.2వేల స్కాలర్షిప్లను ఇస్తున్నారు.
- 1999-2000 సంవత్సరంలో పాఠశాలలో పదో త రగతి చదివిన పూర్వ విద్యార్థులు రూ.25వేల విలు వ చేసే వాటర్ కూలర్‌ను బహూకరించారు. 2005-2006 పదో తరగతి పూర్వ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో సావిత్రీబాయి ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
- అమెరికాలోని మిన్నిసోట ఏరియా తెలంగాణ అసోసియేషన్(మాటా) ద్వారా జినుగ మహేందర్‌రెడ్డి సహకారంతో పాఠశాలకు రూ.62వేల విలువ చేసే లైబ్రరీ బీరువాలు, టేబుల్స్, కుర్చీలు, సైన్స్ ల్యాబ్ బీరువాలు, రూ.50వేల విలువైన సౌండ్సిస్టమ్ సమకూర్చారు. కర్ర మల్లారెడ్డి రూ.50వేల విలువ చేసే లైబ్రరీ పుస్తకాలు అందజేశారు.
- గ్రామానికి చెందిన రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ కరస్పాండెంట్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి పాఠశాలకు పోడియం, ప్రింటర్, మైక్‌సెట్, రెండు తరగతి గదుల్లో ఫ్యాన్లు అందజేసి ఐదేళ్లుగా తొర్రూరులోని వివిధ పరీక్షా కేంద్రాల్లో బోర్డు ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యే విద్యార్థులకు బస్సుల ద్వారా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు.
- గ్రామానికి చెందిన 100-స్మైల్ సంస్థ వ్యవస్థాపకుడు చిట్టిమల్ల మనోజ్‌కుమార్ పాఠశాలలో 15 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పలుమార్లు విద్యార్థులకు ఉచితంగా షూ అందజేశారు.
- పాఠశాలలోని జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కాలుసాని వెంకట్‌రెడ్డి పాఠశాల కొత్త భవనానికి రూ.30వేల నగదుతో ఐరన్ గేటును ఏర్పాటు చేయించారు. వీటికి తోడు పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల సందర్భంలో స్నాక్స్ కోసం అనుమాండ్ల తిరుపతిరెడ్డి, అడిషనల్ డీఆర్డీఏ డాక్టర్ సట్ల వెంకట్, మదర్‌థెరిసా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సిరికొండ విక్రమ్ రూ.10వేల చొప్పున అందజేసి వారి ఉదారత చాటుకున్నారు.
- వందేమాతరం ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు గణి త మెళకువలకు ప్రత్యేక శిక్షణ, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వారి సహకారం మరువలేనిది
చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలకు గ్రామ ప్రజలు, ఎన్నారైలు, ఉద్యోగులు అందిస్తున్న సహకారం వెలకట్టలేనిది. 15 ఏళ్ల క్రితం ఇక్కడ ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. ఐదేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం. ఇంగ్లిష్ మీడియంతో చెర్లపాలెం స్కూల్ రోల్‌మోడల్‌గా నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. ఇటీవల సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకుంటున్న నిర్ణయాలతో మాలాంటి పాఠశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. చిన్నాచితక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
- తండ ప్రభాకర్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, చెర్లపాలెం
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

