ఖేలో ఇండియా పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి : డీడీజీ శ్రీవాస్తవ
ఖేలో ఇండియా పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి అని డీడీజీ శ్రీవాస్తవ అన్నారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 24 : ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 అథ్లెటిక్స్ పోటీల నిర్వహణకు సంబంధించి హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఏ మాత్రం జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయి) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (డీడీజీ) మయాంక్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్టేడియంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, క్రీడాకారులకు కల్పించనున్న మౌలిక సదుపాయాలు, పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల పురోగతిని క్షేత్రస్థాయిలో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖేలో ఇండియా జాతీయస్థాయి క్రీడా పోటీలు కావడంతో స్టేడియంలో అన్ని ఏర్పాట్లు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని స్పష్టం చేశారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రీడావసతులు సిద్ధం చేయాలని తెలిపారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశిత గడువులోగా పూర్తిచేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్న నేపథ్యంలో స్టేడియం పరిసరాలు, క్రీడా మైదానం, ఇతర వసతులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. పోటీల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా నోడల్ ఆఫీసర్ పవన్ (డిప్యూటీ కలెక్టర్), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ హరీష్‌బాబు, ప్రాజెక్ట్ ఆఫీసర్ సంతోష్‌కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి సారంగపాణి, కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోదావరి తీరంలో కార్తీక వెలుగులు.. పోటెత్తిన భక్తులు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
‘బీమా సౌకర్యంతో జీపీ సిబ్బందికి ఆర్ధిక భద్రత’
RS Praveenkumar | మెటా ఆఫీస్‌పై దాడి చిన్నదట.. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
పాలగుట్టపై వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

