కాంగ్రెస్, బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడగొట్టాలి : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ అర్బన్ : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని.. కాంగ్రెస్, బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడగొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నియోజకవర్గ పరిధిలో క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఎమ్మెల్సీ డి. రాజేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు గ్యాదరి బాలమల్లు, ఎంపీ బండ ప్రకాష్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, బొంతు రామ్మోహన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ.. మీ కోరికలు న్యాయమైనవి. అందుకే ఎమ్మెల్యే నరేందర్ వాటిని తీరుస్తారు. నేను బాధ్యత తీసుకుంటాను. కేంద్రంలో రిజర్వేషన్ తీసే కుట్ర బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతుంది. రైల్వే, బీఎస్ఎన్ఎల్, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ చేసి ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నం జరుగుతోంది.
కాంగ్రెస్ పాలనలో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నపుడు మైనారిటీలకు రూ. 850 కోట్లు ఖర్చు పెడితే కేసీఆర్ వచ్చాక కేవలం తెలంగాణలోనే రూ. 5,712 కోట్లు ఖర్చు పెట్టారు. చర్చిల అభివృద్ధికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఫండ్ ఖర్చు పెట్టుకునే అవకాశం సీఎం కల్పించారు. మీకు ఏ కష్టం వచ్చినా కాపాడుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

