ఓరుగల్లుకు అవమానం
ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణాన్ని తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఓరుగల్లు ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కాకతీయ కళాతోరణం, స్వాగత తోరణం, ద్వారతోరణం, విజయ తోరణం, శిలాతోరణ ద్వారం.. ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా శిల్పుల గొప్ప కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.
- తొలగింపుపై ప్రజల్లో ఆగ్రహం
- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓరుగల్లు మద్దతు
- ఇప్పుడు ప్రాధాన్యతను తగ్గించేలా సర్కారు తీరు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చరిత్రకారులు, ప్రజలు
- రాజముద్ర నుంచి కళాతోరణం మాయం
- కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం
ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణాన్ని తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఓరుగల్లు ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కాకతీయ కళాతోరణం, స్వాగత తోరణం, ద్వారతోరణం, విజయ తోరణం, శిలాతోరణ ద్వారం.. ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా శిల్పుల గొప్ప కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఈ తోరణం కేవలం అలంకారం కోసం చేసిన డిజైన్ కాదు.. కాకతీయుల పాలనా వైభవాన్ని చాటిచెప్పే చిహ్నం. ప్రజలు మెచ్చేలా పాలించిన కాకతీయుల స్ఫూర్తిని కొనసాగించేలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలో కళాతోరణానికి స్థానం కల్పించారు. కానీ కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయంతో ఓరుగల్లు చారిత్రక ప్రాధాన్యతను తగ్గించి అవమానిస్తున్న తీరు ప్రజలు, చరిత్రకారుల మండిపాటుకు కారణమవుతున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ప్రజలు మద్దతుగా నిలిచి 12 స్థానాల్లో పది సీట్లు గెలిపించినందుకు కనీస కృతజ్ఞత కూడా లేకుండా చారిత్రక చిహ్నాన్ని మాయం చేయడంపై భగ్గుమంటున్నారు.
– వరంగల్, మే 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణాన్ని తొలగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఓరుగల్లు ప్రజలు మండిపడుతున్నారు. ప్రజల సంక్షేమమే పరమావధిగా పరిపాలన సాగించిన కాకతీయులకు గుర్తింపుగా కళాతోరణం నిలిచింది. కాకతీయుల కళాతోరణానికి ప్రత్యేకత ఉన్నది. ప్రభుత్వ రాజముద్ర నుంచి దీన్ని తొలగించేలా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుండడంతో ఓరుగల్లుకు ఉన్న ప్రాధాన్యతను పూర్తిగా చెరిపిపేసినట్లయ్యింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో పది సీట్లలో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన కృతజ్ఞత కూడా లేకుండా ఓరుగల్లుకు ఉన్న చారిత్రక గుర్తింపును మాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉన్నదని ఓరుగల్లు ప్రజలు భగ్గుమంటున్నారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్ష సాకారమై 2014లో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణకు ఉన్న చారిత్రక ప్రత్యేకత, ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగించిన కాకతీయుల స్ఫూర్తిని కొనసాగించేలా ఉండేందుకు వీలుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలో కళాతోరణానికి స్థానం కల్పించారు. కాకతీయుల కంటే ఓరుగల్లుకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతకు గుర్తుగా ఇది నిలిచింది.
కళా నైపుణ్యానికి నిదర్శనం
ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగించిన కాకతీయులు అనగానే మొదట గుర్తుకొచ్చేది కాకతీయ కీర్తితోరణం. కాకతీయ కళాతోరణం, స్వాగత తోరణం, ద్వారతోరణం, విజయ తోర ణం, శిలాతోరణం ద్వారం.. ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా కాకతీయ తోరణాలు శిల్పుల గొప్ప కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి. భారతీయ ఆలయాల నిర్మాణ వాస్తు సంప్రదాయంలో తోరణాల నిర్మాణం క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో మొదలైంది. తోరణాల నిర్మాణ పద్ధతికి ఆద్యుడిగా శాతవాహన రాజైన శాతకర్ణిని పేరొనవచ్చు. అతను సాంచి స్తూపం చుట్టూ నాలుగు దికుల్లో నాలుగు తోరణ ద్వారాలను నిర్మించాడు. ప్రస్తుతం హిందూ దేవాలయాలకు మనం చూస్తున్న తోరణ ద్వారాల నిర్మాణ సంప్రదా యం బౌద్ధ స్తూపాలతో వచ్చింది. కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండలో ని పద్మాక్షిగుట్ట వద్ద ఏర్పాటుచేసిన మొదటి దశ తోరణంగా చరిత్రకారులు పరిశోధించారు. 1117వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు. ఐనవోలు, కొలనుపాకల్లో ఏర్పాటు చేసిన రెండో దశ తోరణంలో లేని ప్రత్యేకతలు వరంగల్ కోటలో మనకు కనిపిస్తాయి. అనంతరం కాకతీయుల రాజధాని ఓరుగల్లు(ఖిలావరంగల్)కు మారింది. అక్కడ ప్రతిష్ఠించిన కీర్తి తోరణాలు మరింత కళావైభవంతో కనిపిస్తాయి. ఇప్పడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో చారిత్రక సంపదకు గుర్తింపు లేకుండా పోతున్నది. సర్కారు నిర్ణయంపై చరిత్రకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

