తెలుగు సంవత్సరంలో మొదటి రోజు వచ్చేదే ‘ఉగాది’. చైత్ర శుక్ల పాఢ్యమి నాడు ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఎన్నెన్నో ఆనందానుభూతులు, ఆటుపోట్లను మిగిల్చిన శోభకృత్ నామ సంవత్సరం, క్రోధి నామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ వెళ్లిపోయింది.
ఈ పర్వదినం తమ జీవితాల్లో కోటి కాంతులు నింపాలని కోరుకుంటూ ‘ఉగాది’ని మంగళవారం ఉమ్మడి జిల్లావాసులు ఘనంగా జరుపుకోనున్నారు. కాగా, ఖిలావరంగల్ గుండుచెరువు వద్ద ఉదయిస్తున్న సూర్యుడు, అప్పుడే లేచి రెక్కలు విప్పుతున్న బాతులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్లున్న దృశ్యాన్ని ‘నమస్తే తెలంగాణ’ తన కెమెరాలో బంధించింది.
– ఫొటోగ్రాఫర్, వరంగల్, ఏప్రిల్ 8