ములుగు జిల్లా వాజేడు మండలం బొల్లారం అటవీ ప్రాంతంలో చిట్టిముత్యాల జలపాతం తెల్లని ముత్యాలు దొర్లినట్లుగా జాలువారుతూ కనువిందు చేస్తున్నది. పర్యాటకులు జలపాతం వద్ద ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
– వాజేడు, జూలై 22
ఏడుబావుల.. జాలువారంగ
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో పాండవుల గుట్టకు అనుసంధానంగా ఉన్న మిర్యాలపెంట సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏడుబావుల జలపాతం కనువిందు చేస్తున్నది. గుట్టలపై నుంచి జాలువారుతూ పర్యాటలకును ఆకర్షిస్తున్నది.
– గంగారం, జూలై 22
బొగత.. పర్యాటకుల పులకింత
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో తెలంగాణ నయాగరా బొగత జలపాతం పాల నురగలా పరవళ్లు తొక్కుతూ జాలువారుతున్నది. పర్యాటకులకు కనువిందు చేస్తున్నది.
– వాజేడు, జూలై 22
గుండం.. అద్భుతం
ములుగు జిల్లా వాజేడు మండలం అరుణాచలపురం అటవీ ప్రాంతంలో గుండం జలపాతం రెండు గుట్టల మధ్య నుంచి సన్నని ధారాల జాలువారుతూ ఆకట్టుకుంటున్నది. సెలవు రోజు కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు.
– వాజేడు, జూలై 22