గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు
గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆమె తాడ్వాయి, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల్లో పర్యటించారు.
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
- తాడ్వాయి, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల్లో పర్యటన
- పలు అభివృద్ధి పనులు ప్రారంభం
తాడ్వాయి/ గోవిందరావుపేట/ కన్నాయిగూడెం/ ఏటూరునాగారం, జూలై 13 : గిరిజన గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆమె తాడ్వాయి, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల్లో పర్యటించారు. తాడ్వాయి మండలం పోచారంలో కంటైనర్ సబ్ సెంటర్, గోవిందరావుపేట మండలం చల్వాయిలో రూ.1.35లక్షలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదులు, వసతి భవనం, కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లిలో రూ.3.50 కోట్లతో కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాల నూతన భవనం, ఏటూరునాగారం మండలంలోని అల్లంవారి ఘనపూర్‌లోని పల్లె దవాఖాన (సబ్ సెంటర్)భవనాన్ని కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి మంత్రి ప్రారంభించారు.
తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈసందర్బంగా ప్రజల నుంచి రోడ్డు, విద్యుత్, వైద్యం,బస్సు. జీసీసీ డిపో, పోడు పట్టాలు తదితర సమస్యలపై వినతులను స్వీకరించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రి సీతక్క మాట్లాడారు. గిరిజన గ్రామాల ప్రజలు వైద్యం అందక ఇబ్బందులు పడుతుండటంతో కంటైనర్ సబ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ఉన్న పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం దృష్టిసారించిందని, కొత్తగా అడవులను నరికి పోడు చేయవద్దని సూచించారు. మీ సేవ కేంద్రాలు, శక్తి క్యాంటిన్ల ఏర్పాటుపై మహిళలకు అవగాహన కల్పించి పోత్సాహం అందిస్తామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహా రం అందించాలని టీచర్‌ను ఆదేశించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. 10వ తరగతి నుంచి కేజీబీవీని అప్‌గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ విద్య అందిస్తున్నట్లు చెప్పారు. అనుమతి లేకుండా విద్యార్థులను బయటకు పంపించొద్దని అధికారులను ఆదేశించారు.
చల్వాయి పాఠశాల గ్రౌండ్ లెవలింగ్, బోర్స్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానన్నా రు. మూడేళ్లుగా కన్నాయిగూడెం కేజీబీవీ విద్యార్థినులు టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించి జిల్లాలో మంచి పేరు సంపాదించారన్నారు. కొత్తగా ఏర్పడిన మారుమూల మండలానికి గుర్తింపు తీసుకొచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ ఏడాది 10/10 జీపీఏ సాధించిన విద్యార్థిని కే శివాణిని సీతక్క శాలువాతో సన్మానించారు. అలాగే ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థుల సామర్థ్యం పెంచాలని సూచించారు. కాగా, మంత్రి మాట్లాడుతుండగా కొద్దిసేపు కరెంటు పోయింది. దీంతో ‘నాకు ఎందు కు ఇలా జరుగుతుంది’ అని విద్యుత్ శాఖ అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఏఈ స్వామి వెంటనే ఫోన్ చేసి విద్యుత్ వచ్చేలా చేశారు. కార్యక్రమాల్లో ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య, జీసీడీవో రమాదేవి, గిరిజన సంక్షేమశాఖ ఈఈ వీరభద్రం, తహసీల్దార్లు రవీందర్, సృజన్‌కుమార్, జగదీశ్వర్, ఏటూరునాగారం ఎంపీడీవో రాజ్యలక్ష్మి, చల్వాయి పాఠశాల హెచ్ఎం వెంకటలక్ష్మి, వైద్యురాలు సుమలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

