కేఎంసీలో ప్రొఫెసర్ల కొరత
కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో ప్రొఫెసర్ల కొరత ఏర్పడింది. బదిలీల్లో ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరించడంతో వైద్య విద్యార్ధులకు శాపంగా మారింది.
- 30 మందికి పైగా బదిలీ
- ఆందోళనలో వైద్య విద్యార్ధులు
- నియామకాలు లేకుండా బదిలీలేమిటని ఆవేదన
వరంగల్ చౌరస్తా, జూలై 22 : కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో ప్రొఫెసర్ల కొరత ఏర్పడింది. బదిలీల్లో ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరించడంతో వైద్య విద్యార్ధులకు శాపంగా మారింది. కళాశాలలో నియామకాలు చేపట్టకుండా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను బదిలీ చేయడం వల్ల తాము పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 20శాతం బోధకుల లోటుతో నెట్టుకొస్తున్న సమయంలో అందుబాటులో ఉన్న సగం మందిని ప్రభుత్వం బదిలీ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెడుతున్న ఈ బదిలీలను మరోసారి ప్రభుత్వం పరిశీలించి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు.
నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలు అనుసరించి మెడికల్ కళాశాలల్లో ఉన్న వసతులు, బోధనా సిబ్బందిని పరిగణలోకి తీసుకొని పీజీ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ప్రస్తుతం కేఎంసీ నుంచి భారీగా ప్రొఫెసర్లు బదిలీపై వెళ్లడంతో రానున్న విద్యాసంవత్సరానికి అవసరమైన ప్రొఫెసర్లు అందుబాటులో లేక పీజీ సీట్ల కేటాయింపులో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రొఫెసర్ల కొరత కారణంగా ఇతర కళాశాలల ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో పీజీ మెంటార్ వ్యవస్థ కొనసాగుతున్నదని, రానున్న రోజుల్లో మరింత ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు.
ప్రముఖ విభాగాల్లో బదిలీలు
- జనరల్ మెడిసిన్‌లో ఆరుగురుప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్లు, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీపై వెళ్లగా నలుగురు ప్రొఫెసర్లు మాత్రమే నియామక పత్రాలు తీసుకున్నారు.
- మైక్రోబయాలజీ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు బదిలీపై వెళ్లగా ఉస్మానియా నుంచి ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ మాత్రమే బదిలీపై వచ్చారు.
- జనరల్ సర్జరీ విభాగంలో ఐదుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు బదిలీపై వెళ్లగా ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ఫ్రొఫెసర్ మాత్రమే కేఎంసీకి వచ్చారు.
- చెవి,ముక్కు, గొంతు (ఈఎన్టీ) విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు బదిలీ కాగా ఒకరు మాత్రమే నియామక పత్రం తీసుకున్నారు.
- ఆర్ధోపెడిక్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.
- కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీ కావడంతో ఆ విభాగం ఖాళీగా మారింది.
- సైకాలజీ విభాగంలో ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.
- రేడియాలజీ విభాగంలో ఇద్దరు అసోసియేట్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీపై వెళ్లారు.
- భారీ వరదను సైతం తట్టుకొని నిలబడిన బరాజ్
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వేల క్యూసెక్కుల నీరు వృథా
- కేసీఆర్, బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకే ప్రయత్నాలు
- రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు మానుకొని రైతులకు మేలు చేయాలి
- బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

