నగరంలో గురువారం మధ్యాహ్నం సుమారు గంట పాటు వర్షం దంచికొట్టింది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఏకధాటిగా పడ్డ వర్షంతో నగరంలో రోడ్లు జలమయమయ్యాయి. గ్రామాల్లో పంటచేలకు వర్షం ఊపిరిపోసింది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్