Mahabubabad | విద్యార్థులపై ప్రైవేటు పాఠశాలల కమిషన్ దందా.. చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
Mahabubabad | మండల పరిధిలోని కొన్ని ప్రయివేటు పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫామ్స్, ఇతర విద్యాసామాగ్రిని తమ వద్దే కొనాలంటూ.. వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ.. పిల్లల తల్లిదండ్రులకు భారం మోపుతున్నారు.
Mahabubabad | మరిపెడ : మండల పరిధిలోని కొన్ని ప్రయివేటు పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫామ్స్, ఇతర విద్యాసామాగ్రిని తమ వద్దే కొనాలంటూ.. వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ.. పిల్లల తల్లిదండ్రులకు భారం మోపుతున్నారు. ప్రయివేటు పాఠశాలల కమిషన్ దందా పట్ల విద్యాశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
మరిపెడ మండలంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ధరలకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ విక్రయిస్తూ విద్యార్థుల నుండి వేల రూపాయలు దోచుకుంటున్నారు. కేవలం పాఠ్య పుస్తకాల కోసం 9వ తరగతి విద్యార్థుల వద్ద రూ. 6937 చొప్పున, ఆరో తరగతి విద్యార్థుల వద్ద రూ. 5164 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇవి బహిరంగ మార్కెట్లో అయితే కేవలం రూ. 2200 లోపే వస్తున్నాయి. స్కూల్ ఫీజులు కూడా యధేచ్చగా వసూలు చేస్తూ దందాలకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వ నిబంధనలకు తూట్లు..
రాష్ట్ర ప్రభుత్వ నిబంధన ప్రకారం పాఠశాలలో స్టేషనరీ, నోట్ బుక్స్, యూనిఫామ్ లు వంటివి పాఠశాలలో విక్రయించరాదు. తల్లిదండ్రులకు దుకాణాలను మాత్రమే సిఫారసు చేయాలి, అప్పుడు తల్లిదండ్రులు వారికి ఇష్టం వచ్చిన దుకాణాలలో పాఠ్యపుస్తకాలను కొనుగోలు చేయొచ్చు. కానీ నేడు ప్రైవేట్ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పుస్తకాలను విక్రయించే వారితో ఒప్పందం చేసుకొని వారి నుండి నేరుగా విద్యార్థులకు పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తూ కమిషన్లు తీసుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలలు తమ ఆవరణలో కాకుండా బయట ప్రదేశాలలో రూములు కిరాయి తీసుకుని విక్రయాలను కొనసాగిస్తున్నారు. దుకాణాల ద్వారా విక్రయించడం వలన భారీ మొత్తంలో పాఠశాలల యజమానులు లాభాలను పొందుతున్నారు. పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు యూనిఫాములు, స్టేషనరీ అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో పాఠశాలల గుర్తింపు రద్దు చేయబడుతుందని ప్రభుత్వం హెచ్చరించిన ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు..
ప్రయివేటు పాఠశాలల కమిషన్ దందాల విషయంలో ప్రభుత్వ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

