ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాల్సిందే..
ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాల్సిందేనని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ర్యాలీ, రాస్తారోకోలు నిర్వహించాయి. విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం పాఠశాలలు, కళాశాలల బంద్ విజయవంత మైంది.
- విద్యారంగాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ సర్కారు
- విద్యార్థి సంఘాల ర్యాలీ, రాస్తారోకో
- సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 10 : ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాల్సిందేనని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ర్యాలీ, రాస్తారోకోలు నిర్వహించాయి. విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం పాఠశాలలు, కళాశాలల బంద్ విజయవంత మైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించింద న్నారు. సర్కారు పాఠశాలలను మూసివేయాలనే కుట్ర ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంట నే భర్తీ చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, డీఎస్ఏ, టీఎస్ఎఫ్, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీ తదితర సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

