రేపు మేడారంలో మండె మెలిగే పండుగ
పూజారులు రేపు (బుధవారం) మేడారంలోని సమ్మక్క-కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరాల్లో మండె మెలిగే పండుగ నిర్వహించనున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవార్ల మహా జాతరకు ముందు వచ్చే బుధవారం గుడి మెలిగే పండగను నిర్వహించారు.
- వైభవంగా నిర్వహించనున్న పూజారులు
- మహా జాతర ప్రారంభమైనట్లు సంకేతాలు
తాడ్వాయి, ఫిబ్రవరి 12 : పూజారులు రేపు (బుధవారం) మేడారంలోని సమ్మక్క-కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరాల్లో మండె మెలిగే పండుగ నిర్వహించనున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవార్ల మహా జాతరకు ముందు వచ్చే బుధవారం గుడి మెలిగే పండగను నిర్వహించారు. అనంతరం వచ్చే బుధవారం మండె మెలిగే పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. సమ్మక్క పూజా మందిరంలో సిద్దబోయిన వంశస్తులు, సారలమ్మ ఆలయంలో కాక వంశీయులు పండుగను వైభవంగా నిర్వహించనున్నారు. మొదట తల్లుల గద్దెల వద్దకు వెళ్లి పూజారులు, వారి కుటుంబ సభ్యులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన పూజారి సిద్దబోయిన మునీందర్ ఇంటికి చేరుకుని అక్కడి నుంచి పసుపు, కుంకుమ, మామిడి తోరణాలతో తరలివచ్చి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ప్రధాన రహదారులకు బూరుగు చెట్టు కర్రలతో ధ్వజ స్తంభాలకు మామిడి తోరణాలు, కోడి పిల్లలను కట్టి కట్టడి ఏర్పాటు చేస్తారు. సమ్మక్క పూజా మందిరానికి చేరుకుని తల్లి గద్దె, గుడిని శుద్ధి చేస్తారు.
సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్య, సారలమ్మ పూజారులు కాక సారయ్య, కిరణ్ భద్రపరిచిన పూజా సామగ్రిని శుద్ధి చేసి తల్లులకు ప్రత్యేక పూజలు చేస్తారు. దూప, దీప నైవేద్యం సమర్పించి అమ్మవార్ల మహా జాతర ప్రారంభమైనట్లు పూజారులు సంకేతాలు ఇస్తారు. వచ్చే బుధవారం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని తల్లిని గద్దెపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ మండె మెలిగే పండుగతో ప్రారంభమైన పూజలు మహాజాతర ముగిసిన అనంతరం వచ్చే బుధవారం నిర్వహించే తిరుగువారం పండుగ వరకు కొనసాగుతాయి. పూజల అనంతరం గద్దెల వద్దకు కన్నెపల్లి నుంచి సారక్క పూజారులు బయలుదేరి వచ్చి సిద్దబోయిన, కాక వంశీయులు ఒకరికి ఒకరు సాకను ఇచ్చిపుచ్చుకుంటారు. రాత్రంతా పూజలు నిర్వహిస్తూ జాగరణ చేస్తారు. వేకువజామున సమ్మక్క-సారలమ్మ పూజా మందిరాల వద్దకు చేరుకుని తల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజారులు, వారి కుటుంబ సభ్యులు కాళ్లకు చెప్పులు లేకుండా పదిహేను రోజులపాటు అత్యంత నియమ నిష్టలు పాటిస్తారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

