జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి
మేడారం మహా జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం మేడారం హరితహోటల్లో పారిశుధ్య నిర్వహణపై శిక్షణ, సమ్మక్క భవన్లో మహా జాతర ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది.
- పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలి
- 1.50 కోట్ల మంది భక్తులకు సౌకర్యాలు
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
- కొలువుదీరిన మహాజాతర ఉత్సవ
- కమిటీ ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం
తాడ్వాయి, ఫిబ్రవరి15 : మేడారం మహా జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం మేడారం హరితహోటల్లో పారిశుధ్య నిర్వహణపై శిక్షణ, సమ్మక్క భవన్లో మహా జాతర ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు.ఉత్సవ కమిటీ చైర్మన్‌గా అర్రెం లచ్చుపటేల్, సభ్యులుగా మిలుకూరి ఐలయ్య, కొండి గోపాల్, గిర్ల రాజారత్నం, కొంపల్లి శ్రీనివాసరెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణసింగ్, ముంజాల భిక్షపతి, చుంచు హైమావతి, చామర్తి కిశోర్, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్రం, అంకం కృష్ణస్వామి, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రమాణ స్వీకారం చేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతర సమయం దగ్గర పడుతున్నందున భక్తుల తాకిడి రోజు రోజుకూ పెరిగే అవకాశాలున్నాయన్నారు. ఇందుకు అనుగుణంగా పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ జాతర కోసం భక్తులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
1.50 కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాలతో సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఇప్పటికే 30లక్షల మంది అమ్మవార్లను దర్శించుకున్నారని, జాతర విజయవంతంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మహాజాతర నిర్వహణ సక్రమంగా జరిగేందుకు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. ఆదివాసీ బిడ్డగా, మహిళా మంత్రిగా అమ్మవార్లకు సేవ చేసే అవకాశం వచ్చినందు కు సంతోషంగా ఉందన్నారు. జాతరలో పూజారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితారామచంద్రం మాట్లాడుతూ జాతరలో అధికారులు చిత్తశుద్ధి, సమన్వయంతో సేవలు అందించాలని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జాతరకు విధులు కేటాయించి అధికారులు ఈ నెల 19 నుంచి అధికారులకు రిపోర్టు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ అధికారులకు కేటాయించిన జోన్లలో విధులు నిర్వర్తిస్తూ పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ పీ శబరీష్, డీపీవోలు, డీఎల్పీవోలు, జోనల్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

