మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు.
వాజేడు, జూన్4 : ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు సోమవారం వంట చెరకు కోసం కొంగాల అడవిలోకి వెళ్లి మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మృతి చెందిన నేపథ్యంలో నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై ఏసు కుటుంబసభ్యులతో పాటు బంధువులు, గ్రామస్తులు ర్యాలీ తీశారు. ‘మావోయిస్టుల పోరాటం అంటే అమాయకులు, మూగ జీవాలను చంపడమేనా?, అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు ఏజెన్సీవాసులకు లేదా’ అంటూ మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

