మేడారంలో పూజారుల నిరసన
మేడారం సమ్మక్క-సారలమ్మకు కేటాయించిన స్థలాన్ని భద్రకాళి దేవస్థాన పూజారులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం గద్దెల ప్రధాన గేట్‌కు తాళాలు వేసి పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తాడ్వాయి, మే29 : మేడారం సమ్మక్క-సారలమ్మకు కేటాయించిన స్థలాన్ని భద్రకాళి దేవస్థాన పూజారులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం గద్దెల ప్రధాన గేట్‌కు తాళాలు వేసి పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దేవస్థానానికి వరంగల్ పట్టణంలో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయించగా, ఆ స్థలంలో ఇటీవల భద్రకాళి, మెట్టుగుట్ట దేవస్థానం సంయుక్త నిధులతో సెంట్రల్ జైల్ ఎదురుగా ధార్మిక భవనాన్ని నిర్మించారన్నారు. అప్పటి నుంచి పలు దేవస్థాన కార్యాలయాలు అందులోనే కొనసాగుతుండగా గత కొద్ది రోజుల నుంచి భద్రకాళి దేవస్థాన అయ్యగార్లు భవనాన్ని ఖాళీ చేయాలని, వేద పాఠశాల నిర్వహిస్తామని చెప్తూ మంత్రులు, ఎమ్మెల్యేలతో దేవాదాయశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. తమ దేవస్థానానికి చెందిన భవనంపై వారి పెత్తనం ఏంటని, దీనిలో రాజకీయ జోక్యం ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. నేడు కూడా ఇక్కడ నిరసన చేస్తామని, అధికారులు స్పందించకుంటే వచ్చేనెల 5నుంచి 8 వరకు భద్రాకాళి దేవస్థానం ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. తమ హక్కులు సాధించుకునే వరకూ ఆందోళనలు చేస్తామన్నారు. కాగా, అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో మేడారం జాతర ఈవో రాజేంద్రం వైపున ఉన్న గేట్ ద్వారా భక్తులకు దర్శనం కల్పించారు.
ధర్నాను విరమింపజేసిన మంత్రి సీతక్క
పూజారుల ధర్నా శిబిరాన్ని మంత్రి సీతక్క సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు తెలుసుకొని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం మంత్రి సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు చేసి మొక్కులు చెల్లించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

