Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Power crisis | కాంగ్రెస్ తెలివిలేని, చేతకానితనంతోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆరోపించారు.
జయశంకర్ భూపాలపల్లి : కాంగ్రెస్ ( Congress ) తెలివిలేని, చేతకానితనంతోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ( Power crisis ) ఏర్పడిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ( Gandra Venkataramana Reddy ) ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యుత్ సంక్షోభంతో రాష్ట్రం పరిస్థితి హృదయ విషాదకరంగా ఉందని పేర్కొన్నారు. అనాలోచితమైన రేవంత్ ఆలోచనలతో రైతులు అరిగోస పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో బొగ్గుగనుల్లో ఉత్పత్తి పూర్తిగా తగ్గిందని ఆరోపించారు.
సింగరేణి వ్యాప్తంగా 70 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కావాల్సి ఉండగా కాంగ్రెస్ తెలివి తక్కువ తనంతో కేవలం 58 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిందని వెల్లడించారు. రాజకీయ కక్షలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడం లేదని, విద్యుత్ పై విషయ పరిజ్ఞానం లేక అధికారులను బెదిరింపులకు గురిచేయడం సిగ్గుచేటని విమర్శించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

