జపాన్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
విదేశీ ఉద్యోగాల నియామకాల్లో భాగంగా జపాన్‌లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కమ్) ఆధ్వర్యాన అర్హులైన నర్సింగ్ అభ్యర్థుల ఎంపిక కోసం రెండో పైలట్ బ్యాచ్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు వరంగల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మాధవి తెలిపారు. సోమవారం ఆమె ఒక ప్రకటన చేశారు
పోచమ్మమైదాన్, జనవరి 2: విదేశీ ఉద్యోగాల నియామకాల్లో భాగంగా జపాన్‌లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కమ్) ఆధ్వర్యాన అర్హులైన నర్సింగ్ అభ్యర్థుల ఎంపిక కోసం రెండో పైలట్ బ్యాచ్ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు వరంగల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మాధవి తెలిపారు. సోమవారం ఆమె ఒక ప్రకటన చేశారు. ఈ నెల 4 నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్లో శిక్షణ ఇస్తారని ఆమె చెప్పారు.
ఇందు కోసం సంబంధిత కళాశాలలు, సంస్థల నుంచి బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్లు, జీఎన్ఎం డిప్లొమా హోల్డర్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎలాంటి అనుభవం లేకున్నా 22 నుంచి 35 సంవత్సరాల లోపు కలిగి ఉన్న వారు వీటికి అర్హులని ఆమె పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మెడికల్ కాలేజీలో జరిగే స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాలన్నారు.
సూచించిన తేదీల్లో ఉదయం 10 గంటల లోపు రిపోర్టు చేయాలని వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు జపనీస్ భాషపై రెసిడెన్షియల్ శిక్షణతోపాటు అక్కడ పనిచేయడానికి అవసరమైన అదనపు వృత్తిపరమైన నైపుణ్యాలు ఇస్తారని తెలిపారు. వారికి నెలకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షలు ఇస్తారని వివరించారు. ఇతర వివరాలకు టామ్‌కామ్ హెచ్ఆర్ సెల్‌నంబర్లు 9100798204, 9908830438లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

