ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యపు జబ్బు పట్టిన వైద్యరంగానికి స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రీట్మెంట్ చేస్తున్నది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నది. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ వైద్యశాలలను అభివృద్ధి చేసింది. అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తేవడంతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలను కూడా ఉచితంగా చేస్తున్నది. ఇప్పటికే ములుగు, జయశంకర్ జిల్లాల్లో ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ను విజయవంతంగా అమలు చేయగా నేటి నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభించనుంది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులపై సందేశాన్ని ప్రజలకు వివరించనున్నది.
– వరంగల్, జూన్ 13 (నమస్తేతెలంగాణ)
వరంగల్, జూన్ 13(నమస్తేతెలంగాణ): సమైక్య పా లనలో నిర్లక్ష్యపు జబ్బుతో నిర్వీర్యమైన సర్కారు వైద్యా నికి స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ జవసత్వాలు తెచ్చింది. మారుమూల ప్రాంతాల ప్రజలు, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టింది. ప్రజ ల అవసరాలకు అనుగుణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్ల స్థాయి పెంచింది. పీహెచ్‌సీల పరిధి లోని మెజారిటీ సబ్ సెంటర్లలో పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చింది. యూపీహెచ్ల పరిధిలో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. పీహెచ్‌సీలు, యూపీ హెచ్‌సీలకు దూరంగా ఉన్న గ్రామాలు, కాలనీల ప్రజల కు పల్లె, బస్తీ దవాఖానల్లో ఎంబీబీఎస్ డాక్టర్ల ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం కల్పించింది. ఇన్నాళ్లు అద్దె భవనాల్లో కొనసాగిన పీహెచ్‌సీలు, యూపీహె చ్‌సీ లతో పాటు సబ్‌సెంటర్లకు సొంత భవనాలు నిర్మిస్తున్న ది. వివిధ దవాఖానలను ఇప్పటికే ఆధునీకరించింది.
పలు పీహెచ్‌సీల్లో 24గంటల వైద్య సేవలను అమల్లోకి తెచ్చింది. కొన్ని పీహెచ్‌సీల్లో మహిళల కోసం ప్రత్యేక క్లినిక్‌లను ప్రారంభించి ప్రతి మంగళవారం ఎనిమిది రకాల ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నది. జనగామ, మహ బూబాబాద్, ములుగులోని ఏరియా హాస్పిటళ్లను జిల్లా దవాఖానలుగా అప్‌గ్రేడ్ చేసింది. వివిధ ప్రాంతాల్లో కొత్త హాస్పిటళ్లు, మాతా శిశు సంరక్షణ కేంద్రాలను నెలకొ ల్పింది. ఎంజీఎంహెచ్ సహా ఉమ్మడి జిల్లాలో నాలుగు ఉచిత డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చిం ది. వీటితో పాటు తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసి వీటిలో అనేక రకాల పరీక్షలను ప్రజలు ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. క్రిటికల్ కేర్, రేడియాలజీ హబ్ వంటివి కూడా నెలకొల్పి వైద్య సేవల ను విస్తృతం చేసింది. సబ్ సెంటర్ నుంచి పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా వైద్యశాలలతో పాటు అన్ని సర్కారు దవాఖానల్లో పెద్ద ఎత్తున వైద్యుల ను, సిబ్బందిని నియమించింది.
అన్ని విభాగాల్లో అధు నాతన యంత్రాలను ఏర్పాటు చేసింది. సూపర్ స్పెషా లిటీ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేం దుకు వరంగల్‌లో రూ.1116కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. సమైక్య పాలనలో ఉమ్మ డి వరంగల్ జిల్లాలో ప్రభుత్వరంగంలో ఒకేఒక మెడికల్ కాలేజీ ఉంటే స్వరాష్ట్రంలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు రావడం విశేషం. వీటితో పాటు నర్సింగ్, ఆయుష్ వంటి కాలేజీలను కూడా తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. మెడికల్ కాలేజీల్లో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లనూ నియమించింది. నార్మల్ డెలివరీ లను ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రసవాలు జరిగేందుకు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలను అమలు చేస్తున్నది. ప్రయోగాత్మకంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు వంటి జిల్లాలో అమలు చేసిన కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ పథకాన్ని ఈ నెల 14 నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని నిర్ణయించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటివెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి మందులు, కళ్లద్దాలను సైతం అందిస్తున్నది.
కొత్త హాస్పిటళ్లు… స్థాయి పెంపు
తెలంగాణ ఏర్పాటు తర్వాత భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మొదట 100 పడకల హాస్పిటల్‌ను నెలకొ ల్పింది. తర్వాత దీన్ని 350 పడకలకు అప్‌గ్రేడ్ చేసింది. ఇక్కడ మాతా శిశు సంరక్షణ, ప్రత్యేక పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. త్వరలో న్యూట్రిషియన్ రీహాబిటేషన్ సెంటర్ ప్రారంభం కానుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రూ.10 కోట్లతో 50 పడకల సమీకృత ఆయుష్ వైద్యశాల పనులు తుదిదశకు చేరాయి. మహ దేవపూర్, చిట్యాల సీహెచ్‌సీల్లో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లు, బ్లడ్ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు పనులు జరు గుతున్నాయి. నర్సంపేటలో జిల్లా స్థాయి వైద్యశాలను రూ.67కోట్లతో 250 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నది. ఇక్కడ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా నర్సంపేటకు ప్రభుత్వం క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేసింది.
వరంగల్ ఎంజీఎం, నర్సంపేట, జనగామతో పాటు ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో ప్రభు త్వం ఉచిత డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. ఏటూరునాగారం, జనగామ, మహబూబాబా ద్ జిల్లా కేంద్రాల్లోనూ టీ డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. జనగామలో రేడియాలజీ హబ్‌నూ నెలకొల్పింది. జనగామ, ములుగు, మహబూబాబాద్ ఏరియా దవాఖానలను జిల్లా స్థాయికి అప్‌గ్రేడ్ చేసింది. మహబూబాబాద్‌లో రూ.40 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్, రూ.3 కోట్లతో సీటీ స్కాన్ మిషన్, మామ్ మోగ్రామ్ మిషన్ ఏర్పాటు చేసింది. ములుగులోనూ సీటీ స్కాన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ రేడియాలజీ హబ్ సెంటర్ పనిచేస్తున్నది. హనుమకొండ జిల్లా పరకాలలో బ్లడ్ బ్యాంకు, తల్లి పాల బ్యాంకు ఏర్పా టయ్యాయి. ఇక్కడ రూ.35 కోట్లతో వంద పడకల వైద్యశాల నిర్మాణంలో ఉన్నది.
కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు
ఉమ్మడి వరంగల్‌కు తెలంగాణ ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. మహబూబా బాద్‌లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. దీనికి అనుబంధంగా ఇక్కడ టీచింగ్ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల మంజూరయ్యాయి. జనగామ, భూపాలపల్లి మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రా రంభం కానున్నాయి. ములుగులో వచ్చే యేడు నుంచి తరగతులను ప్రారంభించే దిశగా ఏర్పాట్లు జరు గుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ రూ.65 కోట్లతో 300 పడకల ప్రభుత్వ దవాఖాన పనులు కొనసాగుతు న్నా యి. ఒక నియోజకవర్గం మాత్రమే ఉన్న ములుగు వంటి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కావడం దేశ చరిత్రలోనే ప్రథమమని ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వరంగల్ పర్యటనలో చెప్పారు.
హెల్త్ సిటీగా వరంగల్
వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, ఎంజీఎం, కేఎంసీతో పాటు ఇక్కడ రూ.1,116 కోట్లతో 24 అంత స్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను 2,100 పడకల కెపాసిటీతో నిర్మిస్తున్నది. ఎంజీఎంకు ప్రభుత్వం ఐదు ఎమర్జెన్సీ పీజీ సీట్లను కేటాయించింది. ఇక్కడ రూ.కోటికి పైగా వెచ్చించి డిజిటల్ ఎక్స్‌రే మిషన్ నెలకొల్పింది. రూ.1.50 కోట్లతో సీటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేసింది. గతంలో ఐసీయూ వార్డులోని బెడ్స్‌కు మాత్ర మే ఉన్న ఆక్సిజన్ వసతిని అన్ని వార్డుల్లోని బెడ్స్‌కు కల్పించింది. ఉచిత మందుల వినియోగంలో సీడీఎస్ నుంచి గతంలో ఉన్న 20 నుంచి 25 శాతం కేటా యింపులను ప్రస్తుతం 75 శాతం వరకు పెంచింది.