ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలి

దుగ్గొండి, ఏప్రిల్17: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గ్రామాల్లో పల్లెప్రగతి పనులను నూరుశాతం పూర్తి చేసి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించి చాపలబండ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వన నర్సరీతో పాటు అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచి పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె పార్కులో మొక్కల రక్షణకు నిత్యం నీళ్లు పోయాలని, నర్సరీలోని ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ ఎడెల్లి రజిత, ఏపీవో విద్యావతి, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, పీఎస్ హెచ్ఎం పరుపాటి సుధాకర్‌రెడ్డి, రజిని, రాధిక, రాజు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలి
చెన్నారావుపేట: కరోనా వ్యాప్తి నివారణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భూక్యా హరిసింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించి ఎంపీడీవో లలిత, తహసీల్దార్ పూల్సింగ్చౌహన్తో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రజలందరూ విధిగా కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా ఊరూరా దండోరా వేయించాలన్నారు. టీకాపై ఎలాంటి అపోహలు, ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని, పాజిటివ్ వచ్చిన వాళ్లు హోం ఐసొలేషన్‌లో ఉండేలా మానిటరింగ్ చేయాలన్నారు. అలాగే మండలంలోని సమస్యలపై ఎంపీడీవో లలితను అడిగి తెలుసుకున్నారు.
ఉన్న డంపింగ్‌యార్డు, వైకుంఠధామాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పనుల్లో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ధర్మాతండా, బోడమాణిక్యం తండాల్లోని నర్సరీలు, డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట ఏపీవో అరుణ, ఈసీ కిశోర్, సర్పంచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

