ధైర్యశాలి.. దాశరథి
అభ్యుదయ కవి దాశరథి కృష్ణామాచార్యులు ధైర్యశాలి అని, నిరంతరం పేదల పక్షాన ఉన్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. పట్టణంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్ లో దాశరథి కృష్ణామాచార్యులు జయంతి ఉత్సవాల సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు.
- నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు
- చిన్న గూడూరులో జన్మించడం మన గర్వకారణం
- రేపు శతజయంతి ఉత్సవాలు
- ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు
మహబూబాబాద్ రూరల్, జూలై 20: అభ్యుదయ కవి దాశరథి కృష్ణామాచార్యులు ధైర్యశాలి అని, నిరంతరం పేదల పక్షాన ఉన్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. పట్టణంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్ లో దాశరథి కృష్ణామాచార్యులు జయంతి ఉత్సవాల సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాశరథి కృష్ణాచార్యు లు నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడని, పేదలకు న్యాయం చేసేందుకు అనేకసార్లు జైలు జీవితం గడిపారని పేర్కొన్నారు.
అలాంటి గొప్ప వ్యక్తి మానుకోట జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో జన్మించడం గర్వకారణమన్నారు. నిజాంకు వ్యతిరేకంగా తిరగబడినందుకు నిజామాబాద్ జైలులో తరబడి నిర్బంధించగా జైలు గోడలపై ‘నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అని రాశారని తెలిపారు. తన కవితలు, రచనలతో ఎంతో మందిని చైతన్యం చేశారని చెప్పారు.
శతజయంతి ఉత్సవాలు
ఈనెల 22న దాశరథి శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దాశరథి పుట్టిన ఊరైన చిన్న గూడూరులో ఆయన విగ్రహానికి వేసి నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి రచయితలతో కలిసి పట్టణ కేంద్రంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్‌కు భారీ ర్యాలీగా చేరుకోనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం జిల్లాలోని కవులు, రచయితలతో దాశరథి కవిత్వం, రచనలపై చర్చాగోష్టి, పట్టణ పుర ప్రముఖులతో చర్చా వేదిక ఉం టుందని వివరించారు.
పేర స్మృతివనం, ఆడిటోరియం, కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అతిథులుగా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు బానోత్ రవికుమార్, కౌన్సిలర్ ఎడ్ల వేణు, కన్న, వెంకన్న, రామకృష్ణ, కరుణాకర్, కమలాకర్, శంకర్, శివ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

