హనుమకొండ, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఒక వైపు జరుగుతుంటే.. మరోవైపు ఉద్యమంలో తన కొడుకును కోల్పోయిన ఓ తల్లి మంత్రి పొంగులేటి ముందు కంటతడి పెట్టుకున్నది. మంగళవారం హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ అమరుల కుటుంబాలను మంత్రి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన పల్లె రాజేశ్వరి మంత్రి వద్దకు వెళ్లి రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్షతో ఎన్నో కుటుంబాలు త్యాగాలు చేశాయని, అందులో తాము కూడా ఉన్నామని తెలిపారు. కొడుకు జ్ఞాపకాలతో బతుకుతున్నానని, ఉపాధి కోసం ఇబ్బంది పడుతున్నానని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి, పింఛన్ మంజూరు చేయాలని కోరింది.