CMRF | సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ మాలోతు కవిత..

మహబూబాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదల ఆరోగ్యాలను సీఎంఆర్ఎఫ్ పథకం కాపాడుతుందని మానుకోట పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి 16 మంది లబ్ధిదారులకు రూ.21, 00, 500లకు సంబందించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ…రాష్ట్రంలో ఎంతో మంది నిరుపేదల ఆరోగ్యాలకు సీఎంఆర్ఎఫ్ పథకం భరోసా కల్పిస్తుందన్నారు. ఎక్కడా కూడా పేదలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవద్దనే సదుద్ధేశ్యంతో ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుందని చెప్పారు.
ఆపద వస్తే సీఎం కేసీఆర్ ఆదుకుంటారనేందుకు ఈ పథకమే ప్రత్యక్ష ఉదహరణగా చెప్పవచ్చన్నారు. నిరుపేదలకు సాయం చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మహబూబ్‌పాషా, సీనియర్ నాయకులు పర్కాల శ్రీనివాసరెడ్డి, ముత్యం వెంకన్న, నల్లాని నవీన్‌రావు, పంజాల శ్రీను, పొన్నాల యుగంధర్, దాసరి రావీష్, బోడ లక్ష్మణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

