టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

ఆగస్టు 19, 20వ తేదీల్లో పరీక్షలు
టీఎస్, ఏపీ రాష్ర్టాల్లో 14 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు
భీమారం, ఏప్రిల్ 3 : తెలంగాణ రాష్ట్ర ఐసెట్-2021 ఎంట్రన్స్ టెస్ట్ ఆగస్టు 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కే రాజిరెడ్డి తెలిపారు. శనివారం కాకతీయ యూనివర్సిటీ కామర్స్ విభాగంలో పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ మహేందర్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి ఐసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి జూన్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. మూడు సెషన్స్‌లో ఆన్లైన్లో పరీక్ష ఉంటుందన్నారు. సాధారణ అభ్యర్థులు రూ.650, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.450 ఫీజు చెల్లించాలన్నారు. రూ.250 అపరాధ రుసుముతో జూన్ 30 వరకు, రూ.500తో జూలై 15వరకు, రూ.1000తో ఆగస్టు 11వ తేదీ వరకు చెల్లించుకునే అవకాశమిచ్చినట్లు తెలిపారు. ఆగస్టు 8 నుంచి 11 వరకు దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 13న హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని వివరించారు.
ఫలితాలను సెప్టెంబర్ 17న వెల్లడించనున్నట్లు రాజిరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 12 సార్లు ఐసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ విజయవంతంగా నిర్వహించిందన్నారు. పరీక్షల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రా ష్ర్టాల్లో 14 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 200 మార్కులకు పరీక్ష ఉంటుందని, 50 మార్కు లు వస్తే క్వాలిఫై అవుతారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు అవస రం లేదన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వరని తెలిపారు. సమాచారం కోసం వెబ్సైట్ https://icet.tsche.ac.in.లో చూడవచ్చన్నారు. ఈ స మావేశంలో ఐసెట్ మాజీ కన్వీనర్ ప్రొఫెసర్ కే ఓం ప్రకాశ్, ప్రొఫెసర్ చింతకింది రాజేశం, కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ వరలక్ష్మి, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సత్యవతి, అధ్యాపకులు డాక్టర్ పీ అమరావేణి, డాక్టర్ నరసింహాచారి, సత్యనారాయణ, శ్రీకాంత్, మధు, అరుణ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
రాష్ర్టానికి మరో రెండు నేషనల్ హైవేలు
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

