భయం వద్దు.. ధైర్యంగా ఉండండి..

కరోనా పేషంట్లతో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ సందర్శన
నేత్ర, పిల్లల వైద్య నిపుణులను నియమించాలని ఫోన్లో సీఎండీని కోరిన గండ్ర
దవాఖాన విస్తరణకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశం
భూపాలపల్లి, జూన్ 9 : కరోనా వచ్చిందని భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. మేమున్నా’మంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కొవిడ్ బాధితుకు భరోసా ఇచ్చారు. బుధవారం భూపాలపల్లిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్‌ను ఆయన సందర్శించారు. కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి అక్కడ అందుతున్న వైద్యం, భోజనం గురించి ఆరా తీయగా బాగుందంటూ వారు బదులిచ్చారు. అ తర్వాత వంటశాలలోని ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న ఆక్సిజన్ ప్లాంట్‌ను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దవాఖానలో అన్ని విభాగాల డాక్టర్లతో మాట్లాడారు. ఆ తర్వాత సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సీటీ స్కాన్, డయాలసిస్ పరికరాలను అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. దవాఖానలో పిల్లలు, నేత్ర వైద్య నిపుణులు కొరత ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర.. వెంటనే సీ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్‌కు ఫోన్ చేశారు. వైద్య నిపుణులతో పాటు, పిల్లల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని, చనిపోయిన వారిని తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనం సమకూర్చాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏరియా దవాఖానను విస్తరించేందుకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఎమ్మెల్యే గండ్ర ఆదేశించారు. ఇక్కడ భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం టీ శ్రీనివాసరావు, ఎస్వోటూ జీఎం విజయప్రసాద్, డీవై సీఎంవో పద్మజ, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, నాయకులు రత్నం సమ్మిరెడ్డి, తుమ్మెటి రఘోత్తంరెడ్డి, జక్కిరెడ్డి, బడితల సమ్మయ్య, టీఆర్ఎస్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, మం దల విద్యాసాగర్‌రెడ్డి, బుర్ర రమేశ్, కౌన్సిలర్లు సమ్మయ్య, శ్రీనివాస్ ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

