చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు

కరీమాబాద్, మే 3 : నగరంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు వరంగల్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం ఏకశిలానగర్‌లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాం కును మెగా ఫ్యామిలీ రాష్ట్ర అధ్యక్షుడు కరాటే ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొవిడ్ బాధితులు ఆక్సిజన్ బ్యాం కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెగా కరాటే ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న వారికి ఆక్సిజన్ అందించి అండగా ఉండేందుకు చిరంజీవి చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిద్దం రాజు, నాయకులు వద్దిరాజు వెంకటేశ్వర్లు, బెడిదె వీరన్న, బొక్క నిరంజన్, సాంబయ్య, గాదె మధుసూదన్, వేనవంక కిరణ్, రాజుకుమార్, బొల్లోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. అత్యవసరంగా ఆక్సిజన్ కావాల్సిన వారు 9849009993, 9704242965, 98669 71651 సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

