అంతా లాక్డౌన్

పది దాటిందంటే గడపదాటని జనం
నిర్మానుష్యంగా రోడ్లు
నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసుల జరిమానాలు
నర్సంపేట, మే 17 : లాక్డౌన్ నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పోలీసులు సోమవారం జరిమానా విధించారు. అయ్యప్ప ఆలయం ఎదురుగా ఉన్న చెక్‌పోస్టు వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే పంపించారు. అత్యవసర పనులకు వెళ్లే వాహనాలకు తప్పనిసరిగా పాస్‌లు ఉండాలని పోలీసులు తేల్చిచెప్పారు. రైతులు ధాన్యం బస్తాలను కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించారు.
చెన్నారావుపేటలో 21 మందికి జరిమానా
చెన్నారావుపేట : మండలంలో లాక్డౌన్ నిబంధనలను ఎస్సై శీలం రవి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అమలు చేస్తున్నారు. సోమవారం నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిపైకి వచ్చిన 21 మంది వాహనదారులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఎస్సై వెంట కానిస్టేబుళ్లు తిరుపతి, ఉపేందర్, రామకృష్ణ, క్రాంతికుమార్ ఉన్నారు.
పరకాలలో..
పరకాల : పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సీఐ పింగిళి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపైకి వచ్చిన పలువురికి జరిమానాలు విధించారు.
దామెరలో..
దామెర : కరోనా నివారణకు పోలీసుశాఖ తగిన చర్యలు తీసుకుంటూ కృషి చేస్తున్నదని శాయంపేట సీఐ రమేశ్‌కుమార్ అన్నారు. సోమవారం దామెర మండలంలోని ఊరుగొండ, దుర్గంపేట, ఒగ్లాపూర్, దామెర-కొత్తపేట క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టి అవసరం లేకున్నా ద్విచక్రవాహనాలపై తిరుగుతున్న వారికి జరిమానా విధించారు. ఆయన వెంట ఎస్సై భాస్కర్ రెడ్డి, ట్రైనీ ఎస్సై, కానిస్టేబుళ్లు ఉన్నారు.
శాయంపేటలో..
శాయంపేట : మండలంలో సీఐ తోగిటి రమేశ్‌కుమార్, ఎస్సై అకినపెల్లి ప్రవీణ్‌కుమార్ నిత్యం లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు. అనవసరంగా బయటకు వస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌కు సహకరిస్తుండటంతో ఆరవ రోజు ప్రశాంతంగా జరిగింది.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

