రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ : ఎంపీ వెంకటేష్ నేత
ఎంపీ వెంకటేష్ నేత | దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ అందిస్తూ సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా మారాడని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ అందిస్తూ సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా మారాడని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి శుక్రవారం ఎంపీ ప్రారంభించారు.
కాటారం నుంచి విలాసాగర్ వరకు రూ.10 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ దళితులను ఉన్నతి కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. దీనిపై విమర్శలు చేయడం అవివేకమన్నారు.
సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే దళితులను ఉన్నత స్థాయిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో దళిత క్రాంతి పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దళితులు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో దళిత బంధు పథకం తీసుకువస్తే ఎన్నికల కోసమే ప్రవేశపెట్టాలంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
కరోనా సంక్షోభ సమయంలోనూ ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షసాధింపు ధోరణి అవలంభిస్తున్నదని విమర్శించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

