జనగామ : తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి డైరీ, క్యాలెండర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అర్చక సమాఖ్య, సమాజంలో ఆధ్యాత్మిక భావాలను పెంపొదింస్తున్నదని అభినందించారు. ప్రజల్లో భక్తిభావంతో శాంతి సౌఖ్యాలను పెంపొందించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ పాల్గొన్నారు.