ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన
విద్యార్థులు రూ పొందించిన పలు ఆవిష్కరణలు ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయి. బుధవారం జిల్లా కేంద్రంలోని సాన్‌మారియా హైస్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలను కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ప్రారంభించి, ఎగ్జిబిట్లను తిలకించి అభినందించారు.
- జనగామ జిల్లా కేంద్రంలో ఆకట్టుకున్న సైన్స్ ఫేర్
- ఆలోచింపజేసిన విద్యార్థుల ఎగ్జిబిట్లు
- సృజనాత్మకతను వెలికితీయాలి
- ప్రకృతికి దగ్గరగా పరిశోధనలు జరగాలి
- జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీల్లో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
జనగామ చౌరస్తా, డిసెంబర్ 14 : విద్యార్థులు రూ పొందించిన పలు ఆవిష్కరణలు ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయి. బుధవారం జిల్లా కేంద్రంలోని సాన్‌మారియా హైస్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలను కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ప్రారంభించి, ఎగ్జిబిట్లను తిలకించి అభినందించారు. వాటికి సంబంధించిన వివరాలను విద్యార్థులు, గైడ్ టీచర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నా యి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని అన్నారు. ప్రకృతి గు రించి తెలుసుకోవడమే ‘సైన్స్’ అని, సమాజం గురించి తెలుసుకోవడం ‘సోషల్ సైన్స్’ అని పేర్కొన్నారు. ప్రకృతికి దగ్గరగా పరిశోధనలు జరుగాలని అభిప్రాయపడ్డారు. సైన్స్ ప్రాముఖ్యతను విద్యార్థులకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధన సాగించాలన్నా రు. అసొంలోని గౌ హతిలో జరిగిన 49వ జాతీ య బాల వైజ్ఞానిక్ ప్రదర్శన-2022 పోటీలో పాల్గొని ప్రతిభకనబర్చిన విద్యార్థులు లావుడ్యా నిహారిక, కమ్మగాని శ్రీవిద్య, రాణియా జోహా ను కలెక్టర్ శాలువా, మెమెంటో, ప్రశంసా పత్రాలతో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో సీహెచ్ మధుమోహన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము, సైన్స్ అధికారి గౌసియా బేగం, ముఖ్య ప్రణాళిక అధికారి ఇస్మాయిల్, పెద్ది వెంకటనారాయణగౌడ్, సాన్‌మారియా హైస్కూల్ కరస్పాం డెంట్ జగన్మోహన్రెడ్డి, 16 ఆర్గనైజింగ్ కమిటీల బాధ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బ్రెయిలీ లిపికి అడ్వాన్స్ పరికరం
కంటిచూపు, వినికిడి లోపం కలిగిన దివ్యాంగులకు బ్రెయిలీ లిపి రైటర్ పరికరంతో సమాచారం సులు వుగా అర్థమవుతుంది. ఇది ఇన్పుట్ స్పీచ్ సిగ్నల్‌ను స్వీకరించి అంకెలను గుర్తిస్తుంది. ఆ తర్వాత ప్రాసెస ర్ అవసరమైన ఎన్కోడ్ సమాచారం తో సంబంధిత ఏఎస్‌సీఐఐ కోడ్‌ను పంపుతుంది. ఈ సిస్టం అవుట్ పుట్ బ్రెయిలీ కోడ్ పరికరం ఎన్కోడ్ చేసిన ఇన్పుట్ తీసుకొని దానిని డీ-కోడ్ చేస్తుంది. దీనితో అంధు లు, వినికిడి లోపం ఉన్నవారికి సమాచారం సులువుగా చేరుతుంది. ఇది బ్రెయిలీ లిపికి అడ్వాన్స్‌గా తయారుచేసిన పరికరం. ప్రస్తుతం ఏ నుంచి ఎఫ్ వరకు మాత్రమే డిజైన్ చేశారు.
– విద్యార్థి: ఝాన్సీబాయి, గైడ్ టీచర్: మదన్మోహన్
సరిహద్దు రక్షణకు ఆటోగన్
దేశ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ చొరబాటు, రవాణా వంటి సమస్యల్ని భద్రతా దళాలు ఎదు ర్కొంటున్నాయి. ఇందు కోసం స్మార్ట్ సరిహద్దు భద్రత వ్యవస్థ రూపొందించారు. ఇది ఆటోమేటిక్‌గా పనిచేస్తూ, చొరబాటు, రవాణాను దృశ్యరూపంలో సూచనలిస్తుంది. కంట్రోల్ రూమ్‌లో ఉన్న భద్రతా దళాలను అప్రమత్తం చేస్తుంది. అక్రమ చొరబాటుదారులపైకి తుపాకీ దానికదే గురిపెట్టి కాల్పులు జరుపగలదు.
– విద్యార్థి: అఖిల్, గైడ్ టీచర్: మదన్మోహన్
వేర్వేరు పంటలకు ఒకేసారి ‘డ్రిప్’
మిక్స్డ్ క్రాప్ విత్ డ్రిప్ ఇరిగేషన్ సహాయంతో ఒకే సమయంలో వేర్వేరు పంటలను పండించే అవ కాశం ఉంటుంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సమృద్ధిగా పంటలు పండించవచ్చు. మిక్స్డ్ క్రాప్ వల్ల భూమి లోపల నత్రజని స్థాపన జరిగి నేల సారవంతమవుతుంది. తదుపరి పంటల సాగుకు నేల అనుకూలంగా ఉంటుంది.
– విద్యార్థి: అనుప్రియ, గైడ్ టీచర్: వెంకటేశం
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

