ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిధుల్లేక ఇక్కట్లు
వరంగల్ మహానగరంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు నిధులు లేక నిలిచిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్న సంకల్పంతో వరంగల్ లక్ష్మీపురంలో వెజ్, నాన్‌వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ మార్కెట్, హనుమకొండ ఐబీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
- ముందుకు సాగని వెజ్, నాన్‌వెజ్, ఫ్రూట్, ఫ్లవర్ మార్కెట్ల నిర్మాణ పనులు
- నయా పైసా విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
- గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులతోనే సగం పనులు
- రూ.24కోట్లు ఇస్తేనే అందుబాటులోకి మార్కెట్లు
వరంగల్, జూలై 10 : వరంగల్ మహానగరంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు నిధులు లేక నిలిచిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగర ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలన్న సంకల్పంతో వరంగల్ లక్ష్మీపురంలో వెజ్, నాన్‌వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ మార్కెట్, హనుమకొండ ఐబీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.24 కోట్ల అంచనాతో లక్ష్మీపురం మార్కెట్, రూ.9 కోట్లతో ఐబీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో మార్కెట్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది.
తొలి విడుతలో ఒక్కో మార్కెట్‌కు రూ.4.5కోట్ల నిధులను కేటాయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. అయితే, గత ప్రభుత్వ వి డుదల చేసిన నిధులతో మొదలు పెట్టిన పనులు మాత్ర మే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా విడుదల చేయకపోవడంతో ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో మార్కెట్ల నిర్మాణ ముందుకుసాగడం లేదు. ఆయా పనులకు నిధులు ఎలా సర్దుబాటు చేయాలో తెలియక కార్పొరేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మధ్యలోనే ఆగిన పనులు
రూ.24కోట్ల అంచనాతో వరంగల్ లక్ష్మీపురంలో ఇం టిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్ మార్కెట్లు ఒకే ప్రాంగణంలో ఉండేలా నిర్మాణానికి డిజైన్ చేశా రు. గత ప్రభుత్వం మొదటి విడుతగా రూ.4.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. మిగితా నిధులను ప్రతినెలా గ్రేటర్ కార్పొరేషన్‌కు విడుదల చేసే పట్టణ ప్రగతి నిధులను వినియోగించి పనులను పూర్తి చేయాలని ఆ దేశించింది.
అయితే, మొదటి విడుత విడుదల చేసిన రూ.4.50 కోట్లతో లక్ష్మీపురంలో పిల్లర్లతోపాటు కొన్ని బ్లాక్‌లకు స్లాబ్‌లు వేశారు. వెజ్, నాన్‌వెజ్, ప్రూట్స్, ఫ్లవర్స్ ఇలా నాలుగు మార్కెట్ల నిర్మాణ పనులను ప్రా రంభించి కొం తమేర పనులు చేశారు. ఇక హనుమకొండలోని ఐబీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రెటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభు త్వం మొ దటి విడుత గా రూ.4.50 కో ట్లు విడుదల చేయగా, ఆ నిధులతో సగం పనులు మాత్రమే పూర్తి చేశారు.
నిధులు విడుదలైతే తప్పా ప నులు ముందుకుసాగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి నిధులను నిలిపివేయడంతో మార్కెట్ల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేయాలంటే ప్రభుత్వం ప్ర త్యేకంగా నిధులను విడుదల చేయాల్సిన అవసరం ఉం ది. మార్కెట్ల నిధులపై బల్దియా అధికారులను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి లేఖ రాశామని, నిధులు వస్తే పనులు చేపడుతామని అంటున్నారు. రెండు మార్కెట్లకు కలిపి రూ. 24కోట్ల మంజూరు చేస్తే నిర్మాణాలు పూర్తయి మార్కె ట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

