హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 29: రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో హనుమకొండ షట్లర్లు ఆరు గోల్డ్‌మెడల్స్ సాధించి విజయభేరి మోగించారు. హనుమకొండ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఆదివారం జరిగిన బ్యాడ్మిం టన్ బాలికల అండర్-19 విభాగంలో ఎం కీర్తి (హనుమకొండ) గోల్డ్‌మెడల్ కైవసం చే సుకోగా, బాలమన్వితరెడ్డి (రంగారెడ్డి) సిల్వ ర్, నయనిక రెడ్డి(సూర్యాపేట) బ్రాంజ్ మెడ ల్ సాధించినట్లు జిల్లా క్రీడాధికారి గుగులోత్ అశోక్‌కుమార్ తెలిపారు.
బాలుర విభాగంలో అఖిల్రావ్(హనుమకొండ) గోల్డ్‌మెడల్, అ బ్దుల్ రజాక్బేగ్ (హైదరాబాద్) సిల్వర్, ఆలీసిద్ధిక్ (వరంగల్) బ్రాంజ్ మెడల్, బాలికల డబుల్స్ విభాగంలో పూజిత, నిఖితారావు (హనుమకొండ), నేత్ర సాల్ల, ఆకుల శ్రావ్య(మేడ్చల్ మలాజ్‌గిరి), అన్విరెడ్డి, నైనికరెడ్డి(సూర్యాపేట), బాలురలో అఖిల్రావు, ఏం అ జయ్ కార్తీక్ (హనుమకొండ), వినయ్ సహ స్ రెడ్డి (రంగారెడ్డి), మోహన్‌కృష్ణ, పార్థసార థి (భద్రాద్రి కొత్తగూడెం), మిక్స్డ్ డబుల్స్ లో అజయ్కార్తీక్, కీర్తి (హనుమకొండ), విన య్, సంజన (రంగారెడ్డి), అనురాగ్ శర్మ, అ నురాధ సింధు (హైదరాబాద్)లు వరుస స్థానా ల్లో నిలిచారు.
బాలికల సింగిల్స్‌లో అవినీ విక్రమ్ గోవిం ద్ (రంగారెడ్డి), భూక్యా రిత్వికశ్రీ(భద్రాద్రి కొత్తగూడెం), శ్రీదేవిక ఆదిత్య (మేడ్చల్ మ లాజగిరి) బాలుర సింగిల్స్‌లో పుప్పాల కిష వ్ (హైదరాబాద్), చిన్మయి వాంకడే (రంగారెడ్డి), అక్షత్ రెడ్డి (మేడ్చల్ మలాజగిరి), బా లికల డబుల్స్‌లో హర్షిత, పృథ్వి, పీఅన్య(మేడ్చల్ మలాజగిరి), లిల్లీ గ్రేస్, తేజస్విని (నల్లగొండ), కశ్యపి, గాయత్రి (రంగారెడ్డి), బా లుర డబుల్స్‌లో అక్షయ్‌కుమార్, శ్రీచైతన్శౌ ర్య (హనుమకొండ), చరణ్, విజయ్, బ్రహ్మి త్( మేడ్చల్ మలాజగిరి), చిన్మయి వంఖడే, రామ్ ప్రతీత్ (రంగారెడ్డి) మిక్స్డ్ డబుల్స్‌లో అక్షత్ రెడ్డి, శ్రీదేవిక ఆదిద్య(మేడ్చల్ మలాజగిరి), పీ అక్షిత్ రెడ్డి, జీ చందన(నల్లగొండ), ఎన్ రోహిత్‌కుమార్, భూక్యారిత్వికశ్రీ(భద్రాద్రి కొత్తగూడెం)లు వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
బాలుర హ్యాండ్‌బాల్ విభాగంలో ఉమ్మడి వరంగల్ జట్టు, బాలికల్లో ఆదిలాబాద్ జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. బాలికల్లో వరంగల్ రజతం, రంగారెడ్డి కాంస్యం, బాలురలో మహబూబ్‌నగర్ రజతం, కరీంనగర్ కాంస్య పతకాలు సాధించాయి.
పురుషులు, మహిళల్లో హైదరాబాద్ జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. మహిళల్లో కామారెడ్డి రజతం, నిజామాబాద్ కాంస్యం, పురుషుల్లో రంగారెడ్డి రజతం, ఆసిఫాబాద్ జట్టు కాంస్య పతకం సాధించింది.
ఖమ్మం సిటీ: సీఎం కప్‌లో భాగంగా ఆదివారం ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అండర్-17 రాష్ట్రస్థాయి బాలుర విభాగంలో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్ జట్టు విన్నర్‌గా నిలిచింది. మహబూబ్‌నగర్ జట్టు రన్నర్‌గా, ఖమ్మం జట్టు మూడో స్థా నంలో నిలిచింది. బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు విన్నర్, మహబూబ్‌నగర్ జట్టు రన్నర్ ట్రోపీలను కైవసం చేసుకోగా ఖమ్మం మూడో స్థానంలో నిలిచింది.