తొలివిడత జోరు..
ఉమ్మడి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఆదివారం వాటి పరిశీలన పూర్తయింది. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించారు. మొద టి రోజు ఈనెల 27న స్వల్పంగా దాఖలయ్యాయి. 28న అష్టమి, శనివారం మధ్యాహ్నం వరకు నవతి తిథి ఉండడంతో చాలా మంది సెంటిమెంట్తో దశమి ఘడియలు వచ్చిన తర్వాత నామినేషన్ పత్రాలతో కేంద్రాల వద్ద బారులు తీరారు.
- సర్పంచ్, వార్డుమెంబర్ల స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు
- ఉమ్మడి జిల్లాలో 555 సర్పంచ్లకు 3567, 4952 వార్డుమెంబర్లకు 11,227 దాఖలు
- డిసెంబర్ 2 వరకు రెండో విడత నామినేషన్లు..
నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 30 : ఉమ్మడి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఆదివారం వాటి పరిశీలన పూర్తయింది. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించారు. మొద టి రోజు ఈనెల 27న స్వల్పంగా దాఖలయ్యాయి. 28న అష్టమి, శనివారం మధ్యాహ్నం వరకు నవతి తిథి ఉండడంతో చాలా మంది సెంటిమెంట్తో దశమి ఘడియలు వచ్చిన తర్వాత నామినేషన్ పత్రాలతో కేంద్రాల వద్ద బారులు తీరారు. రాత్రి వరకు ఆ ప్రక్రియ కొనసాగింది. అన్ని లెక్కలు చూసుకున్న తర్వాత ఆదివారం ఉదయం మొదటి విడత నామినేషన్ల వివరాలను అధి కారులు ప్రకటించారు. తొలి రోజు నామినేషన్ల దాఖలు మందకొడిగా సాగిన చివరకు పోటెత్తారు.
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలోని నాలుగు మండలాల్లో 117 జీపీలు, 1008 వార్డు స్థానాలకు, హనుమకొండ జిల్లాలో ఐదు మండలాల్లో 73 జీపీలు, 694 వార్డు స్థానాలు, జనగామ జిల్లాలోని నాలు గు మండలాల్లో 79 జీపీలు, 7108 వార్డులు, మహబూబాబాద్ జిల్లాలోని ఏడు మండలాల్లో 158 జీపీలు, 1360 వార్డులు, ములుగు జిల్లాలోని మూడు మండలాల్లో 52 జీపీలు, 462 వార్డులు, భూపాలపల్లి జిల్లాలోని నాలుగు మండలాల్లో 85 జీపీలు, 694 వార్డులకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 564 సర్పంచ్లు, 4928 వార్డుమెంబర్ల స్థానాలకు ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 266, వార్డుసభ్యులకు 216 నామినేషన్లు దాఖలయ్యాయి.
మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ పూర్తయ్యింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి పరిధిలోని 23 మండలాల్లోని 555 జీపీలు, 4952 వార్డులకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 3567, వార్డులకు 11,227 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాల్లోని 69 సర్పంచ్ స్థానాలకు 496 నామినేషన్లు దాఖలు కాగా స్క్రూటినీలో 100 రిజెక్ట్ అవడంతో 396 మిగిలాయి . అదేవిధంగా 658 వార్డుసభ్యులకు 1747 నామినేషన్లు దాఖలు కాగా 48 తిరస్కరణకు గురవడంతో 1699 మిగిలాయి. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లోని 91 సర్పంచ్ స్థానాలకు 665 నామినేషన్లు దాఖలు కాగా 51 రిజెక్ట్ కావడంతో 614 మిగిలాయి. అదేవిధంగా 800 వార్డుసభ్యులకు 1865 నామినేషన్లు దాఖలు కాగా 61తిరస్కరణకు గురవడంతో 1804 మిగిలాయి.

Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

