దొడ్డు వడ్లు వద్దట..
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతున్నది. ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండిస్తే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టడడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
- ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిరాకరణ
- పై నుంచి అనుమతి లేదంటున్న నిర్వాహకులు
- 15 రోజులుగా కాంటాలేక రైతుల పడిగాపులు
నర్సింహులపేట, మే 1 : రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతున్నది. ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండిస్తే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టడడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వంతో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దొడ్డు వడ్లు కొనుగోలు చేయలేమంటూ కొర్రీలు పెడుతున్నారు. మి ల్లర్లు సన్న ధాన్యం మాత్రమే కావాలంటున్నారని మెలికపెడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రెండు వారాలుగా కాంటాలు లే క రైతులు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు. కొన్ని కేంద్రాల్లో సరిపడా హమాలీలు లేక రైతులే కూలీల అవతారం ఎత్తి బ స్తా లు నింపుతున్నారు. ఇలాంటి స్థితిలో దొడ్డు రకం వడ్లు సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
పై నుంచి అనుమతులు రాలేదని, మిల్లర్లు దొడ్లు వడ్లు వద్దంటున్నారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. దొడ్డు రకం ఎగుమతి చేయలేకపోతున్నామని, ప్రభుత్వం మాత్రం రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నందున కాంటా పెట్టలేమని చెబుతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దొడ్లు వడ్లు తీసుకుంటే నూక శాతం ఎక్కువ ఉంటుందని సాకులు చెప్తున్నారు. వస్రంతండా జీపీ పరిధిలోని కేంద్రాలను డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ గత నెల 22న ప్రారంభించారు. అప్పటికే రైతులు అక్క డ ధాన్యం ఆరబోశారు. ఏ గ్రేడ్ క్వింటాలుకు రూ.2389, బీ గ్రేడ్ రూ. 2369 వస్తుందన్న అశతో దొడ్డు రకం ధాన్యం తీసుకొచ్చారు. మిల్లర్ల పేరుతో కుంటిసాకులు చూపుతూ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు వడ్లను తూకం వేయడం లేదు. దీంతో వీటిని ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నాలుగు ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగు చేశా
యాసంగిలో నాలుగు ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు సాగు చేశా. వస్రంతండా కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 15 రోజులు దాటింది. కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసేటప్పుడు అడ్డు చెప్పలేదు. ఇప్పుడు తేమ శాతం వచ్చాక కాంటా పెట్టేందుకు ఇబ్బంది పెడుతున్నారు. సరైన సమాధానం చెప్పకుండా అలస్యం చేస్తున్నారు. ఎండలకు ఇబ్బంది పడుతున్నాం. వడ్లు కాంటా పెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– బానోత్ శ్రీను, రైతు, హన్మతండా
దొడ్డు వడ్లను కాంటా పెట్టడం లేదు
నేను దొడ్డురకం వరి సాగుచేశాను. ఇటీవల వస్రతండా కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చాను. తీరా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కాంటా పెట్టడడం లేదు. రైస్‌మిల్లర్లు దొడ్డు వడ్లు వద్దంటున్నారని మెలిక పెడుతున్నారు. ఇప్పుడు వీటిని ఎక్కడ అమ్ముకోవాలి. అధికారులు పరిశీలించి ధాన్యాన్ని కొనుగోలు చేయించాలి.
– అజ్మీరా చంద్య, రైతు, గోపతండా
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ala Venkateswar Reddy | కొడంగల్‌కు నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Srinivas Goud | ఆర్డీఎస్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ArjunKapoor | మలైకాతో బ్రేకప్.. అర్జున్ కపూర్, సాహిబా బాలి డేటింగ్ నిజమేనా? వైరల్ అవుతున్న ఫోటో!
Pujita Ponnada |వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాపై నటి పూజిత పొన్నాడ షాకింగ్ కామెంట్స్.. నన్ను మోసం చేశారంటూ ఆవేదన!
Tirumala | తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

