ప్రజాభిప్రాయమే సర్కారు జీవో
ప్రజాభిప్రాయం మేరకే రైతుభరోసా పథకం అమలు చేస్తామని వారి నిర్ణయమే సర్కారు జీవోగా రాబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయాన్ని ఆదుకోనేలా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.
- వ్యవసాయాన్ని ఆదుకొనేలా రైతుభరోసా
- రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
- సాగు చేసేవారికే భరోసా ఇవ్వాలి
- అభిప్రాయం వ్యక్తం చేసిన రైతులు
హనుమకొండ, జూలై 15 : ప్రజాభిప్రాయం మేరకే రైతుభరోసా పథకం అమలు చేస్తామని వారి నిర్ణయమే సర్కారు జీవోగా రాబోతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయాన్ని ఆదుకోనేలా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం రైతుభరోసాపై వరంగల్ కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన ఉమ్మడి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి, మంత్రి వర్గ ఉప సంఘం చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క, సభ్యులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రూనాయక్లు పాల్గొన్నారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకే సర్కారు జీవో జారీ చేయనున్నదని పేర్కొన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలను రాష్ట్రవ్యాప్తంగా తీసుకుంటుందని, ఆమేరకు శాసనసభలో అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో చర్చించి రైతు భరోసాపై తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. పంట సాయం కోసం ప్రభుత్వం అందించే ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకూడదనే రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కట్టే పన్నులతో ప్రజల సంక్షేమం కోసం పథకాలను అందిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. సమావేశాల్లో ప్రతి రైతు చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని వాటిపై చర్చించనున్నట్లు తెలిపారు.
ప్రజాభిప్రాయంతోనే న్యాయం..
ప్రజాభిప్రాయ సేకరణతోనే రైతులకు న్యాయం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. అర్హులైన రైతులకు రైతుభరోసా ఇవ్వాలనేది సర్కారు సంకల్పమన్నారు. రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందన్నారు. పంటలకు బీమా ఎలా చేస్తున్నామో అదేవిధంగా పశువులకు కూడా బీమాను వర్తింపజేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు మేలు చేసేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తారని, ప్రజలు హర్షించే విధంగా రైతు భరోసా ఉండబోతుందని మంత్రి తెలిపారు. సమావేశంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, యశస్వినీరెడ్డి, డాక్టర్ మురళీనాయక్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, రిజ్వాన్ బాషా షేక్, అద్వైత్‌కుమార్ సింగ్, రాహుల్ శర్మ, దివాకర, ఉమ్మడి జిల్లా రైతులు రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అవకతవకలు ఉండొద్దనే..
– మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
రైతు భరోసా విషయంలో అవకతవకలు జరగకూడదనే ఉద్దేశంతో రైతుల అభిప్రాయాలను తీసుకొనేందుకు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల సూచనల మేరకు వ్యవసాయరంగానికి పెద్దపీట వేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆగస్టులో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని. ఇందుకోసం విధివిధానాల రూపకల్పన జరుగుతున్నదన్నారు. రైతుల ఖాతాల్లో రూ. 7,562 కోట్లు ప్రభుత్వం జమ చేసిందన్నారు.
రైతుల విషయంలో వెనుకడుగు వేయం
ఇన్‌కం టాక్స్, పాన్ కార్డ్ ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వరని చేస్తున్న దుష్ప్రచారం నిజం కాదని అన్నారు. రైతులకు సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం వెనకడుగు వేయదని, రైతుల నిర్ణయాలే ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలుగా పరిగణిస్తామన్నారు. పేదోడి రాజ్యం రావాలని, మంచి ప్రభుత్వం కావాలని రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని అన్నారు. రైతును రాజు చేసే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
అసలైన రైతులకే భరోసా
– మంత్రి సీతక
అసలైన రైతులకే రైతు భరోసా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో అందించిన పథకంలో లోపాలు ఉన్నాయన్నారు. పేరుకే పెట్టుబడి పథకం అయినా నిజమైన రైతులకు అందలేదన్నారు. రైతుభరోసా విషయంలో రైతుల అభిప్రాయం అనేది ఎంతో ముఖ్యమని అందుకే జిల్లాల వారీగా ఇలాంటి అభిప్రాయాలను తీసుకొని ఒక మంచి పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవంగా సాగుచేసే రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పేద రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

